కేసీఆర్ ఎండలకు ఆగం ఆగం చేస్తుండని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటీసులు ఇచ్చి బీజేపీ ఆగం ఆగం ఐతున్నారని, నిన్నటి నుండి బీజేపీ వాళ్ళకు నిద్ర లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ల రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అవసరమా అనే చర్చ బీజేపీ నేతలు చేశారని, ఇది వాస్తవమే కదా అని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్లు పై తెలంగాణ లో వ్యతిరేకత వచ్చిందని, రేవంత్ కి నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారన్నారు. బీజేపీకి ఎన్నికల్లో దెబ్బ పడుతుంది అని..నోటీసులు ఇచ్చిందని, కాంగ్రెస్ కి ఎస్సీ, ఎస్టీ, బీసీ అనుకూలం కాబట్టి బీజేపీ కి భయం పట్టుకుందన్నారు జగ్గారెడ్డి. ఎన్నికల స్టంట్ లో భాగమే నోటీసులు అని ఆయన విమర్శించారు. లీగల్ గా ఫైట్ చేస్తామని, కేంద్రం లో హంగ్ లేదు…బొంగు లేదని ఆయన అన్నారు.
ఎప్పుడో ఏడాదికో… అయిదేళ్లకో ఓసారి బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడుతారని విమర్శించారు. ఇప్పుడు ఓటమి భయంతో బస్సుయాత్ర చేస్తున్నారన్నారు. ఓ వైపు ఎండల కారణంగా కేసీఆర్ ఆగమాగం చేస్తుంటే మరోవైపు ఢిల్లీ పోలీసులను పంపి బీజేపీ ఆగమాగం చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని, ఏడాదికి ఒక్కసారి కూడా బయటకు రాని కేసీఆర్… రోడ్డు షో ల పేరుతో రోడ్డ్డున పడ్డారన్నారు. అమిత్ షా.. మోడీ ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ ల గురించి మాట్లాడారా..? అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ మూలంగా మోడీ కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందని, రాహుల్ గాంధీ వెంట.. ఎస్సీ, ఎస్టీ, బీసీ లు వస్తున్నారని బీజేపీ కి అర్థం అయ్యిందన్నారు. మోహన్ భగవత్ కూడా మాట్లాడాడు అంటే.. రాహుల్ గాంధీ క్రెడిట్ కదా అని ఆయన అన్నారు.