Suriya Vs Lokesh: లోకేష్ కనగరాజ్’కు సూర్య మార్క్ షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకేష్ కనగరాజ్ హీరో కావడంతో రిలీజ్‌కి ముందు సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. అయితే ఇప్పుడు అదే లోకేష్‌కు బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీతో ఊహించని పోటీ ఎదురైంది. ‘డీసీ’కి హిట్ టాక్ వచ్చినా, సూర్య దూకుడుతో స్క్రీన్లు, షోలు, ఆడియన్స్ సపోర్ట్ అటువైపు షిఫ్ట్ అయిపోయాయి.
లోకేష్ కనగరాజ్ పేరు వినిపిస్తే యాక్షన్, ఇంటెన్స్ డ్రామా, మాస్ ట్రీట్మెంట్ గుర్తొస్తాయి. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న దర్శకుడు ఈసారి హీరోగా మారడంతో ‘డీసీ’పై ఒక కొత్త రకం క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ క్యూరియాసిటీని భారీ ఓపెనింగ్స్‌గా మార్చేంత హైప్ మాత్రం కనిపించలేదు. కానీ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ‘డీసీ’కి మంచి పికప్ వచ్చింది. అక్కడితో లోకేష్ హీరోగా కూడా ప్రూవ్ చేసుకున్నాడనే టాక్ మొదలైంది.
Also Read
కానీ బాక్సాఫీస్‌లో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ‘డీసీ’కి పోటీగా వచ్చిన సూర్య సినిమా మొదట్లో ఊహించిన దానికంటే బలమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. టాక్ విషయంలో ఆడియన్స్ నుంచి యునానిమస్ సపోర్ట్ రావడంతో, ముఖ్యంగా ఫ్యామిలీ, బీసీ సెంటర్లలో కలెక్షన్స్ గ్రాఫ్ బాగా పెరిగింది. దీంతో ‘డీసీ’కి ఉన్న థియేటర్స్, షోలు క్రమంగా తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక సినిమా యాక్షన్, వయోలెన్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటే, మరో సినిమా కంటెంట్, ఎమోషన్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు తీసుకొచ్చింది. ఇదే ‘డీసీ’కి అతి పెద్ద బాక్సాఫీస్ ఛాలెంజ్‌గా మారింది.
ఇక్కడ సూర్య సినిమాకు దక్కిన సపోర్ట్ ‘డీసీ’ కోట్ల రేస్‌ను మరింత టఫ్‌గా మార్చింది. ‘డీసీ’ ఇప్పటికే హిట్ జోన్లోకి వెళ్ళింది. కానీ హిట్ రావడం వేరు, లాంగ్ రన్ తెచ్చుకోవడం వేరు. కలెక్షన్స్ పరంగా ‘డీసీ’ ప్రస్తుతం ₹80 కోట్ల దగ్గర ఉన్నట్లు ట్రేడ్ టాక్. మరో ₹20 కోట్లు సాధిస్తే హీరోగా లోకేష్ కనగరాజ్ కూడా ₹100 కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది. కానీ సూర్య సినిమా స్ట్రాంగ్‌గా హోల్డ్ అవుతుండడం, కొత్త సినిమాల నుంచి పోటీ పెరగడం, పైగా నెక్స్ట్ వీక్ రవితేజ ‘ఇరుముడి’ రావడం ‘డీసీ’కి ప్రెజర్ పెంచుతున్నాయి. అంటే లోకేష్‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే హిట్ దక్కింది. కానీ అదే హిట్‌ను ₹100 కోట్ల మార్కు వరకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు సూర్య అడ్డుగోడగా నిలిచాడు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!