వైసీపీ అధినేత,సిఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని గుంటూరు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి కిలారు రోశయ్య పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు, నవ సమాజ స్థాపనకు మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
మెదక్ లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసే కుట్ర చేస్తుందని 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మోడీ మారుస్తాడని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందని…
రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ శ్రేణులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనల్ని ప్రజలు ఓడించలేదు.. మనల్ని మనమే ఓడించుకున్నామని కేటీఆర్ తెలిపారు. మనం కూడా జై శ్రీరామ్ అందాం.. రాముడు అందరివాడు.. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కూడా కాదన్నారు. కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ లో…
టీడీపీ, చంద్రబాబు మేనిపెస్టోను ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మేనిఫెస్టోను అమలుపరచి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించలేదన్నారు. 2014 నుంచి 2019 కాదు , చంద్రబాబు 14 ఏండ్ల సీఎంగా ఎప్పుడూ మేనిఫెస్టో అమలు చేయలేదన్నారు.
తీవ్ర ఎండను కూడా ఖాతరు చేయకుండా ప్రజలంతా సభకు వచ్చారని.. మరో రెండు వారాల్లో జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని.. వచ్చే ఐదేళ్లలో ఇంటింటి అభివృద్ధిని.. ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దీనిని ప్రజలు గుర్తించాలన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
పాత సీసాలో పాత సారా లాగా వైసీపీ మేనిఫెస్టో ఉందని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 హామీలు తీర్చకుండా పాత పాటే పాడినట్టుందని, కేంద్ర పధకాల పేర్లు మార్చి వాళ్ళవిగా చెప్పుకున్నారన్నారు. ప్రధానమంత్రి స్వానిధి పధకానికి పేరు మార్చుకుని మేనిఫెస్టో లో పెట్టుకున్నారని, వైద్యరంగానికి కేంద్రం ఇచ్చే పధకం పేరు మార్చుకున్నారన్నారు సూర్యనారాయణ రాజు. కేంద్రం ఇచ్చే ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్ ప్లాన్ నిధులు పక్కదారి…
వైసీపీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ కొనియాడారు. పేదరిక నిర్మూలనకు దివ్య ఔషదం నవరత్నాలు ప్లస్ మ్యానిఫెస్టో అని పేర్కొన్నారు. నోటి వెంట ఒక మాట వస్తే అమలు చేసే సీఎంగా జగన్ పేరు తెచ్చుకున్నారని అన్నారు. రాజమండ్రిలో మంత్రి వేణు మీడియాతో మాట్లాడుతూ అలవికాని 600 హామీలు ఇచ్చి చంద్రబాబు వాటిని తుంగలో తొక్కారని ఆరోపించారు. మళ్లీ అదే మోసంతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. నవరత్నాలు…
మణిపూర్లో హింసాత్మక ఘటనలు.. ఆరు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ మణిపూర్ ఔటర్ లోక్సభ స్థానంలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్ను రద్దు చేసినట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత ఇక్కడ ఏప్రిల్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తాజా ఓటింగ్ జరగనుంది. ఈ ఆరు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నట్లు మణిపూర్ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇది చట్టపరమైన నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా…
బాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని సీఎం జగన్ అన్నారు. ఇవాళ ఆయన తాడిపత్రి నుంచి మలిదశ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన తరువాత తొలి సారిగా ప్రచారంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నా మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశానన్నారు. బటన్ నొక్కి రూ.2లక్షల 70 వేల కోట్లు.. ప్రజల ఖాతాల్లో వేశామన్నారు. లంచాలు లేకుండా, వివక్ష లేని పాలనను అందించాం. ఈ 58…