హ్యాపీ బర్త్ డే.. ఎవర్ గ్రీన్ ‘డార్లింగ్’ ప్రభాస్! రెబల్ ఫ్యాన్స్‌కు దీపావళితో పాటు వచ్చే మరో పెద్ద పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది అక్టోబర్ 23న ఆయన జన్మదినాన్ని అభిమానులు, సినీ ప్రేమికులు ఘనంగా జరుపుకుంటారు. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలో గుర్తించదగిన వేడుకగా మారింది. దేశం నలుమూలలనే కాకుండా ఓవర్సీస్లో యూఎస్, యూకే, జపాన్ వంటి…
నేడు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో BRS నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్న కేసీఆర్. తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల. రేపు మధ్యాహ్నం…
‘నో-హ్యాండ్‌షేక్’ ట్రెండ్‌ను కొనసాగించిన భారత యువ క్రీడాకారులు.. పాక్‌పై ఘన విజయం ఆసియా కప్ క్రికెట్, మహిళల ప్రపంచ కప్ తర్వాత మరో క్రీడా పోటీలోనూ భారత క్రీడాకారులు పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేయకుండా తమ వైఖరిని కొనసాగించారు. మూడవ ఏషియన్ యూత్ గేమ్స్‌లో (Asian Youth Games) భాగంగా జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో భారత యువ జట్టు పాకిస్తాన్ టీమ్‌ను 81-26 తేడాతో చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ ఇషాంత్ రాఠీ…
త్వరలోనే రాజయ్యపేటకు జగన్.. ప్రభుత్వంపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.. అనకాపల్లి జిల్లాలోని రాజయ్య పేట మత్స్యకారుల సమస్యలను వైసీపీ నేతలు విన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయించాలని బొత్స సత్యనారాయణ ముందు మత్స్యకార మహిళలు కంట తడిపెడుతున్నారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల ప్రశాంతత కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వంతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని మత్య్సకారులు కోరారు. ఇక, శాసన మండలిలో విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ…
లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం! నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామం ఘటనలో చనిపోయిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌లకు కూడా పరిహారం ఇవ్వనున్నారు. శాంతిభద్రతలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష…
అసాంఘిక కార్యకలాపాలకు ప్రొద్దుటూరు అడ్డాగా మారింది.. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు పట్టణం క్యాసినో, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది.. టీడీపీ ముఖ్య నాయకులే ఈ వ్యవహారాలను నడిపిస్తున్నారు.. వీరు మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్తో పాటు గోవాలో క్యాసినోలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో…
అయోధ్యలో 26 లక్షల దీపాలు.. రెండు గిన్నీస్ రికార్డులు రామనగరిలో వెలుగుల వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి. అయోధ్య దీపోత్సవానికి ఏకంగా రెండు గిన్నీస్ రికార్డులు సొంతం అయ్యాయి. అయోధ్య నగరంలో 9వ దీపోత్సవంలో భాగంగా ఈ ఏడాది 26 లక్షలకుపైగా దీపాలను వెలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సరయూ నదీ తీరం వెంబడి లక్షలాది దీపాలను వెలిగించారు. నదీ తీరంలోని ఘాట్లు పెద్దఎత్తున భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రామ్‌లీలా వంటి సాంస్కృతిక…
నేను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారు..? నెల్లూరు జిల్లా రాళ్లపాడులో జరిగిన హత్యాయత్నం ఘటనలో గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు యువకులను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో జరిగింది ఒక మారణఖండగా చెప్పవచ్చు అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ముగ్గురు మీద ఉద్దేశపూర్వకంగా కారుతో హత్యాయత్నం చేశారు అని ఆరోపించారు. ప్రమాదం అని ఒక చిన్న కేసు నమోదు చేసినట్లు…
శతాబ్ధాల నాటి ‘‘సతీ’’ శాపం.. ఈ గ్రామ ప్రజలు ‘‘దీపావళి’’కి దూరం.. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ‘‘దీపావళి’’ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. దీపావళికి సంబంధించి కొత్త బట్టలు, టపాసులు, ఇతరత్రా షాపింగ్ జోరుగా సాగుతోంది. తమ కుటుంబాలతో ఆనందంగా పండగను సెలబ్రేట్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామం, గ్రామ ప్రజలు శతాబ్ధాలుగా దీపావళి పండగకు దూరంగా ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ జిల్లాలోని సమ్మూ గ్రామం ఎన్నో…
బంగారం తాకట్టు పేరుతో భారీ మోసం.. బాధితుల ఆత్మహత్యాయత్నం పార్వతీపురంలో మన్యం జిల్లాలో బంగారం తాకట్టు పేరుతో భారీ మోసం జరిగింది. గోల్డ్ షాప్ లో తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వక పోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి బాధితులు పాల్పడారు. పురుగుల మందు, పెట్రోల్ పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బాధితులు బెదిరింపులకు దిగారు. తాము తాకట్టు పెట్టిన 15 తులాల బంగారం షాపు యజమాని ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. అయితే, ఆందోళన నేపథ్యంలో యజమాని బంగారం…