తెలంగాణ బీజేపీ నేతలు మారారా? లేక వీళ్ళింతే… ఇక మారనే మారబోరంటూ అధిష్టానమే వదిలేసిందా? వచ్చిన ప్రతిసారి క్లాస్‌ల మీద క్లాస్‌లు పీకే అమిత్ షా ఈసారి ఏమీ మాట్లాడకుండా వెళ్ళడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? తెలంగాణ నేతల తీరుపై ఢిల్లీ పెద్దలు హ్యాపీనా? లేక ఎలక తోలు తెచ్చి ఎందాక ఉతికినా రంగు మారదన్న సామెతను గుర్తుకు తెచ్చుకున్నారా? టీ బీజేపీలో అసలేం జరుగుతోంది? తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లే టార్గెట్‌గా కసరత్తు చేస్తోంది…
విజయవాడ వ్యాపార రంగానికి వస్త్రలత ఒక ల్యాండ్ మార్క్ వంటిదని కేశినేని శ్వేత అన్నారు. వస్త్రలత కార్మికుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ కార్మికుల, కర్షకుల పక్షపాత పార్టీ అని వ్యాఖ్యానించారు.
ధర్మపురి జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తిపాడు రిజర్వాయర్ మంజూరు చేసి మీ కష్టాలు తీర్చాలని మా నేతలు కోరారన్నారు. రామగుండంలో 2వేల మెగావాట్ల పవర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారని, నేతకాని సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. మీరు అడిగినవన్నీ మంజూరు చేస్తా… కానీ 2లక్షలకు పైగా మెజార్టీతో గడ్డం వంశీని గెలిపించండని ఆయన అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కు ఒక గొప్ప…
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తనలాంటి రాజకీయ నాయకులు జైల్లో మగ్గుతున్న దుస్థితిపై విచారం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీకి తనను చంపడమే మిగిలి ఉందని వ్యాఖ్యానించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా.. ముంబై ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. 19.5 ఓవర్లలో కేకేఆర్ 169 పరుగులు చేసి ఆలౌటైంది. కోల్‌కతా బ్యాటింగ్ లో వెంకటేష్ అయ్యర్ (70), ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మనీష్ పాండే (42) పరుగులతో రాణించడంతో.. కోల్‌కతా ఫైటింగ్ స్కోరు చేయగలిగింది. టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ చివరకు వరకు ఉండి జట్టు స్కోరు పెంచాడు. అతనితో…
10 రోజులకు పైగా కాలిపోతున్న ఉష్ణోగ్రతలను తట్టుకున్న తర్వాత, హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలకు తీవ్రమైన వేడి నుండి కొంత ఉపశమనం లభించింది.హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వేడిగాలులు వచ్చే వారం నుండి తగ్గుతాయని భారత వాతావరణ విభాగం (IMD) సూచించింది. మే 6 వరకు రాష్ట్రంలో హీట్‌వేవ్ అలర్ట్ కొనసాగుతుండగా, ఆ తర్వాత గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది . మే 7 నుండి, ఉరుములు మరియు మెరుపులతో కూడిన హెచ్చరికలకు మార్పు…
ఏపీలో ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం జోరు పెంచుతున్నారు. ఇటీవల నామినేషన్ ప్రక్రియ సైతం ముగిసింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి రానున్నారు. ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన ఉన్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. రెండవ దశ ప్రచార పర్యటనలో భాగంగా…
పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి మెజార్టీ పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాల వల్లే అది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు, తాను చేసిన అభివృద్ధి తన విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని…
Rohith Vemula Case: 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్‌గా ఉన్న రోహిత్ వేముల మృతిపై తెలంగాణ పోలీసులు విచారణ ముగించారు.
ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటి పెరుగుతున్నందున, తెలంగాణకు ఇది అత్యంత కఠినమైన వేసవి సీజన్లలో ఒకటిగా మారుతుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు కురిసే ముందు, మే మొదటి వారం వరకు తీవ్రమైన వేడిగాలులు కొనసాగుతాయని వారు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదయ్యాయి. అయితే.. ఇవాళ ఎండలకు హైదరాబాద్ మండిపోయింది. ఈ సమ్మర్లోనే హైదరాబాద్‌లో ఇవాళ హాటెస్ట్ డే రికార్డ్ అయ్యింది.…