అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం కూడా కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మద్దతు ధర ఇచ్చి కొంటామని, సీఎస్.. కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చామని, రైతులు ఆందోళన చెందోద్దని ఆయన పేర్కొన్నారు. నష్టం ప్రభుత్వం భరిస్తుందని, కొందరు మిల్లర్లు తరుగు తీస్తున్నారని, ఇది సరికాదు.. ఆపేయండని ఉత్తమ్ అన్నారు. చివరి గింజ వరకు కొంటామని, నారాయణ పూర్ డ్యామ్ నుండి నీటి విడుదలకు అంగీకారం చెప్పారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ని…
కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ నుంచి బేగంపేట్ వరకు పట్నం సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర, రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని పేర్కొన్నారు.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ( టీఎస్ బీఐఈ ) 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది. 9 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆయా ఇంటర్ కాలేజీల్లో స్వీకరించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీ లోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ షెడ్యూల్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు…
దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. కాగా.. ఎన్నికల సంఘం ఎక్కువ మందిని ఓటు వేసేలా ప్రేరేపిస్తోంది. ముఖ్యంగా 2024 ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతను ఈసారి ఓటింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. తొలిసారి ఓటు వేసిన ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో యువత పోలింగ్ కేంద్రాలకు వెళ్లి బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) నుంచి ఫారం 6ను సేకరించి నింపారు. ఒకప్పుడు ఓటు హక్కు వయస్సు 21 సంవత్సరాలు ఉండేది. కానీ 1989లో…
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ శివాలెత్తాడు. సెల్ఫీ కోసం వచ్చిన ఓ అభిమానిపై చిర్రుబుర్రులాడాడు. అంతేకాకుండా.. అతని మెడపట్టి గెంటేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో పలుమార్లు అభిమానులపై చేయిచేసుకున్నాడు షకీబ్. అయితే.. ఈసారి ఏకంగా మెడ పట్టుకుని గెంటేశాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. ధాకా ప్రీమియర్ లీగ్‌లో షేక్ జమాల్ ధన్మోండి క్లబ్ కు షకీబ్ అల్ హసన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ…
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతపూర్ లో సబ్బండ వర్గాల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, వివిధ సంఘాల నేతలు కృష్ణయ్య సాయికిరణ్ పాండు శ్రీవాణి వెంకట్రావు గోపాల్ మల్లేష్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వర్గాల మద్దతు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కులాలతో మతాలతో పార్టీలతో ప్రాంతాలతో జెండాలతో సంబంధం…
విస్తృతమైన అవగాహన లేకపోవడం, జన్యుపరమైన సలహాలు, సాంప్రదాయ నమ్మక వ్యవస్థలు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో తలసేమియా ప్రధాన రోగులను కలిగి ఉండటానికి కొన్ని ప్రధాన కారణాలని బుధవారం ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా నిపుణులు తెలిపారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం థీమ్ ‘జీవితాలను సాధికారపరచడం, పురోగతిని పొందడం: అందరికీ సమానమైన మరియు ప్రాప్యత చేయగల తలసేమియా చికిత్స’. ప్రపంచంలోని ప్రతి ఎనిమిదవ…
సిద్దిపేట జిల్లా బీజేపి కార్యాలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. నిన్న కేసీఆర్ తనపై మాట్లాడిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. రఘునందన్ రావు దుబ్బాక లో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డి లో ఓడిపోలేదా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినా కేసీఆర్ కి సిగ్గు ఉండాలని, వెంకట్రామిరెడ్డి ఎన్ని కోట్లు ఇస్తే కేసీఆర్ మెదక్ సీటు ఇచ్చాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్…
టీ20 వరల్డ్ కప్‌కు సరిగ్గా నెల సమయం కూడా లేదు. ఐపీఎల్ అయిపోయిన వెంటనే.. ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అమెరికా, వెస్టిండీస్ ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్.. జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ను ఏంచక్కా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు.. మరో పండగ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మెగా టోర్నీని చూసేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న ఈ ప్రాంతానికి ఏం చేయలేదని నష్టమే చేసింది కానీ ఏమి చేయలేదని ఆమె అన్నారు. ఈ ప్రాంతానికి కేంద్ర విశ్వవిద్యాలయం ఇస్తామని ఇవ్వలేదు ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ మీదుగా రైల్వే లైన్ ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. తెరిపిస్తామన్న సిమెంట్ ఫ్యాక్టరీని ఇప్పటికీ…