Justice Bela Trivedi: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేలా ఎం త్రివేది ఒక కేసు విచారణ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితురాలిగా ఉన్న ఒక మహిళ బెయిల్ పిటిషన్‌ని ఫిబ్రవరి 27న ఆమె విచారిస్తున్న సందర్భంలో.. ‘‘ మహిళ బరువు తగ్గేందుకు ఆమెను కస్టడీలో ఉంచండి’’ అంటూ వ్యాఖ్యానించారు. నిందితురాలు అధిక బరువుతో బాధపడుతోందని, ఆమె తరుఫు న్యాయవాది కోర్టుకు చెప్పిన సమయంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేవారు.
‘‘ఇది ఉపశమనం కోసం కారణం కావాలా..?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయవాది తన క్లయింట్ తరపున వాదిస్తూ.. ఆమె అధిక బరువుతో ఉందని చెప్పాడు. దీనికి న్యాయమూర్తి బేలా త్రివేది మాట్లాడుతూ.. ‘‘ఇది ఉపశమనం పొందేందుకు కారణం కావాలా..? అని అడిగారు’’. ఇందుకు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘నా ఉద్దేశ్యం ఆమెకు బహుళ వ్యాధులు ఉన్నాయి’’ అని చెప్పారు. దీనికి జస్టిస్ త్రివేది మాట్లాడుతూ.. ‘‘ఆమెను కస్టడీలోనే ఉండనివ్వండి, తద్వారా బరువు తగ్గుతుంది.’’ అని చెప్పారు.
Read Also: Actor Darshan: రేణుకాస్వామి హత్య.. యాక్టర్ దర్శన్‌కి హైకోర్టులో ఊరట..
జస్టిస్ బేలా ఎం. త్రివేది గతంలో కూడా వార్తల్లో నిలిచారు. మే 2024లో జరిగిన విచారణలో, బెయిల్ విషయాలను సుప్రీంకోర్టు చేపట్టకూడదని సూచించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదని, ఇది హైకోర్టులతో ముగియాలని, సుప్రీంకోర్టు బెయిల్ కోర్టుగా మారిందని ఆమె అన్నారు.
ఆగస్టు 31, 2021న, జస్టిస్ త్రివేది సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. జస్టిస్ బీవీ నాగరత్న, హిమా కోహ్లీలోతో పాటు నియమితులయ్యారు. ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందడం ఇదే మొదటిసారి. సీనియారిటీ ప్రకారం, జస్టిస్ త్రివేది సుప్రీంకోర్టు చరిత్రలో 11వ మహిళా న్యాయమూర్తి.