రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు చెల్లించాల్సిన స్కూల్ యూనిఫాం కుట్టు ఛార్జీలను రూ.50 నుంచి రూ.75కి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా ఎస్‌హెచ్‌జిలకు పిల్లలకు యూనిఫాం అందించే అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, ఇతర సంస్థల యూనిఫాం కుట్టించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు, జిహెచ్ఎంసి కమిషనర్‌కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది . మార్చి 12న ఇక్కడ…
మనకు తెలిసిన స్నేహితులు డేటింగ్, ఒకరినొకరు ప్రేమించుకోవడం చూసినప్పుడు ఆ ఆలోచన ఎవరి మనస్సులోనైనా రావచ్చు. 'డ్యూడ్, నేను కూడా డేటింగ్ చేయాలనుకుంటున్నాను' లేదా 'నేను కూడా సంబంధంలోకి రావాలనుకుంటున్నాను' అని చాలా సార్లు చాలా మంది చర్చించుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు. కానీ మీరు ఎవరితోనైనా డేటింగ్, రిలేషన్‌షిప్‌లోకి రావాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాలి.
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలో బుద్ధవనంను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున సాగర్ లోని బుద్ధవనంను సందర్శించానని, బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జునసాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని ఆయన తెలిపారు. ఆచార్య నాగార్జునుడు తిరిగిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి…
రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనలు చేసింది. ఈ నెల 9న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు గ్రూప్ - I సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మలన్న విజయం దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్(తీన్మార్ మల్లన్న) ఆధిక్యంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల రాజీనామాలకు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు ప్రభుత్వ అధికారులు. ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రాజధాని గ్రామాలు, ఎయిమ్స్ సమీపంలోని ప్రాంతాలతో పాటు గన్నవరం పరిసర ప్రాంతాలను కూడా చూస్తున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు.