పాక్‌లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది.
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లారు. పద్మావతి అతిధి గృహం నుంచి కుటుంబంతో కలిసి శ్రీవారి ఆలయానికి భయలుదేరి, కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఇఓ శ్యామలరావు, అదనపు ఇఓ వెంకయ్య చౌదరి సీఎం చంద్రబాబుుకు స్వాగతం పలికారు. మంగళవాయుద్యాలు.. వేదమంత్రోచ్చారణల మధ్య మనవడు దేవాన్ష్ తో కలిసి ఆలయ ప్రవేశం చేశారు. చంద్రబాబు కుటుంబసభ్యులను ప్రధాన అర్చకులు ఆశ్వీరదించారు.
ఉద్యోగుల సంపూర్ణ ఆరోగ్యమే సంస్థకు అసలైన సంపద
ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిలో అందిస్తోన్న వైద్య సేవలను వీడియో రూపంలో తెలియపరిచి.. ప్రశంసించాడు కూకట్ పల్లి డిపో కండక్టర్ జీవికే యాదవ్. దీంతో కండక్టర్ ను అభినందిస్తూ టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ట్వీట్ చేశారు. ఆసుపత్రి విషయంలో కండక్టర్ ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని.. మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యాజమాన్యం కట్టుబడి ఉందని వెల్లడించారు. ట్వీట్ లో… TGSRTC అనేది 45 వేల మంది ఉద్యోగ సమూహంతో కూడిన అతిపెద్ద ఉమ్మడి కుటుంబం. కుటుంబ సభ్యుడైన ప్రతి ఉద్యోగి , జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య భద్రత సంస్థ బాధ్యత. అందుకే ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ కూడా ఉన్నతంగా ఉంటుందని భావించి 2021లో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పెద్ద పీట వేయడం జరిగింది. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా సంస్థ ఆధునీకరించింది.
కనికరించిన కనకం.. నేడు భారీగా దిగొచ్చిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. ఇవాళ వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. నేడు తులం బంగారంపై రూ. 440 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,022, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,270 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గడంతో రూ. 82,700 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 తగ్గడంతో రూ. 90,220 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,850గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 90,370 వద్ద ట్రేడ్ అవుతోంది.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సిబ్బంది చేతివాటం.. హుండీలో వేసిన నగలు దోపిడీ..!
బాధ్యతగా ఉండాల్సిన ఆలయ సిబ్బంది తప్పటడుగులు వేశారు. దేవాలయంలో దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఉరవకొండ మండలం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఓ భక్తురాలు హుండీలో వేసిన నగలు మాయం చేశారని ఆలయ సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. అమిద్యాలకు చెందిన రంగయ్య, వనజాక్షి దంపతులు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తాళిబొట్టు గొలుసు, ముక్కుపుడక, చెవి కమ్మలు, వెండి పట్టీలు మూటగట్టి వనజాక్షి హుండీలో వేసింది. పంపకాలలో తేడాలు రావడంతో తిరిగి హుండీలో వేసినట్టు ప్రచారంసాగుతోంది.
హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల!
తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేశారు. యాంకర్ శ్యామల పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదయింది. ‘Andhra365’ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు శ్యామల ప్రమోషన్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త బెట్టింగ్ యాప్‌లు పుట్టుకొచ్చాయి. గతంలోని యాప్‌లు సహా కొత్త వాటి టార్గెట్ సామాన్య, మధ్య తరగతి ప్రజలే. బెట్టింగ్ యాప్‌ల వల్ల అప్పుల పాలై ఇటీవల కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం వల్ల సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన యాంకర్‌లు, బుల్లితెర నటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.
పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మానవతప్పిదాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పెనుగొండ కియా ఫ్యాక్టరీ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలు తప్పడంతో మిగతా రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. క్రేన్ సహాయంతో గూడ్స్ రైలును తిరిగి పట్టాల పైకి చేరుస్తున్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ అభివృద్ధి పనులు శూన్యంగా ఉన్నాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. “అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో” అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. “అప్పు రూ. 1,58,000 కోట్లు – అభివృద్ధి శూన్యం” అని రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. “రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ. 2,500 ఇచ్చారు?” అని ప్రశ్నించారు. అలాగే, “ఎంతమంది వృద్ధులకు రూ. 4,000 పెన్షన్ ఇచ్చారు?” అని నిలదీశారు. అంతేకాకుండా, “రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసి ఎంతమంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారు?” అని నినాదాలు చేస్తూ, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీని గుర్తు చేశారు. “ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు?” అంటూ ‘కల్యాణమస్తు’ పథకం కింద ఇచ్చిన హామీలపైనా ప్రశ్నలు సంధించారు.
ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు.. ఆ తర్వాత హామీలను ఏమార్చారు
ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సభ తొలి క్షణాల్లోనే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలతో సమావేశాలను ఆరంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై చర్చల్లో విపక్ష సభ్యుడు హరీశ్ రావు మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌లో నీతి పాఠాలు చెప్పడంలో బాగా రాణించారని వ్యంగ్యంగా అన్నారు. గత ఏడాది బడ్జెట్‌తో పోల్చుతూ అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. గతంలో బడ్జెట్ అంచనాలను అతిగా పెంచి చూపించారని, ఈసారి మాత్రం వాటిని తగ్గించారని ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా ప్రస్తావించి వాటిపై నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ (LRS) అవసరం లేదని గట్టిగా చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక దాని పేరుతో ప్రజలపై భారం మోపి డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు.
ఏపీకి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా కూటమి కృషి
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గత ప్రభుత్వ హయాంలో పొలిటికల్ ఉద్యోగాలు అందించేలా సలహాదారు నియామకాలు జరిగేవి. కానీ, కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ మాత్రమే సలహాదారుగా నియమించారు. ఏపీకి 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా కూటమి కృషి చేస్తోంది. త్వరలో విశాఖ, విజయవాడలో మెట్రో రాబోతోంది. 11 పట్టణాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం సహకారంతో తెస్తున్నామని వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుంది. మనకు రావాల్సిన నిధులు తెచ్చేందుకు మన ఎంపీలు కృషి చేస్తున్నారు. నా సొంత నిధులతో nirdలో శిక్షణ ఇప్పించి వికసిత్ పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకున్నాం. మా కేశినేని ఫౌండేషన్ ద్వారా అక్కడ గ్రామ సభ ఎలా ఉండాలి, సమస్యలు పరిష్కారం అయ్యేలా టీంలను ఏర్పాటు చేశాం. ఖాళీగా ఉన్న యువతకు ఉపాధి కల్పించేలా పది వేలు స్టై ఫండ్ ఇస్తున్నాం. 295 గ్రామాల్లో యువత ను నియమించి వికసిత్ భారత్ కింద సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నామని అన్నారు.