Kuwait Fire Accident: బతువుదెరువు కోపం పరాయి దేశం వెళ్లి, శవాలుగా తిరిగి వస్తున్న తమ వారిని చూస్తున్న కుటుంబాల కన్నీరును ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. తమవారిని కాలిన మృతదేహాలుగా చూస్తామనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాను ఈ ఆరు నెలల కాలంలో చాలా ప్రాజెక్టులను సందర్శించానని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ను తెలంగాణ మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత వనకాల సీజన్ నుంచి కౌలు రైతులకు రైతు భరోసా, కౌలు రైతులకు రైతులకు ఆర్థిక సాయం అందించాలని సీపీఐ (ఎం) రాష్ట్ర శాఖ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఏడాదికి రూ. వ్యవసాయ కూలీలకు రూ.12,000, మహిళలకు నెలకు రూ.2500 సాయం. ఇది కాకుండా ప్రభుత్వం సన్న వరి వంగడాలకే కాకుండా ముతక రకాలకు కూడా రూ.500 బోనస్ అందించాలని గురువారం ఇక్కడ జరిగిన…
ప్రభుత్వ పాఠశాలల్లో అరుదైన సంఘటనగా సిద్దిపేటలోని ఈ పాఠశాలలో కేవలం 250 సీట్లు ఉన్నప్పటికీ 650 దరఖాస్తులు రావడంతో విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేటలోని ఇందిరా నగర్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం గురువారం పాఠశాలలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా 650 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అనుమతించిన 250కి మించి దరఖాస్తులు రావడంతో పాఠశాల యాజమాన్యం కొద్దిరోజుల క్రితం ప్రవేశ ద్వారం వద్ద ‘నో అడ్మిషన్లు’ అనే బోర్డును వేలాడదీసింది. గత కొన్ని…
కువైట్ లోని దక్షిణ నగరమైన మంగాఫ్ లోని 196 మంది వలస కార్మికులు నివసిస్తున్న 7 అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 45 మంది భారతీయులు మరణించారు. కాగా.. 45 మంది భారతీయుల మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించినట్లు కువైట్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత.. అగ్ని ప్రమాదంలో గాయపడిన భారతీయులకు సహాయం చేయడానికి, మృతదేహాలను భారతదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి…
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాందినీ చౌక్లోని మార్వాడీ కత్రాలో ఈరోజు సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన 30 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మరోవైపు.. ఇంత భారీ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు బృందాలు కూడా ఘటనా స్థలంలో మోహరించారు.
బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గోవులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే జంతూ వధ చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ క్రమంలో.. మూడు కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్ట్ లు పెట్టామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే గోవుల తరలింపు పై 60 కేసులు నమోదు చేశామన్నారు. ఇంతకుముందు చాలాసార్లు…
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీలో విలీనమైన ఐదు టీఎస్ గ్రామాల భవితవ్యంపై వైఖరి చెప్పాలని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కోరింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సాంకేతికతను అందిపుచ్చుకుని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఎన్ఎస్ కెనాల్ కాలనీ…
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తాగిన మైకంలో మితిమీరిన వేగంతో కార్ నడుపుతూ ఒకరి మరణానికి కారణమయ్యారు యువకులు. కూకట్ పల్లిలోని ఒక హాస్టల్ లో నాగర్ కర్నూల్ నలుగురు బ్యాచిలర్ యువకులు ఉంటున్నారు. ఒక యువకుడి పుట్టినరోజు సందర్భంగా… ఫుల్ గా మధ్యం సేవించి కాల్ సెంటర్ కు చెందిన Xylo కార్ లో చార్మినార్ కు వెళ్లి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో…