ఎల్లుండి తెలంగాణకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్..! తెలంగాణ రాష్ట్రానికి ఎల్లుండి (జూన్ 19న) కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాబోతున్నారు. ఇక, కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో వారికి స్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తుంది. భారీ ర్యాలీతో పాటు బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో…
రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు కోతతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చెక్-ఇన్ సహా అనేక సౌకర్యాలు నిలిచిపోయాయి. అయితే కొద్దిసేపటి తర్వాత కరెంటు రావడంతో పరిస్థితి సాధారణమైంది. విద్యుత్ కోత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లో తాము చాలా అసౌకర్యానికి గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. డిజి యాత్ర, చెక్ఇన్ కౌంటర్లు ఆగిపోయాయి. ఈ క్రమంలో.. ఒక వినియోగదారు ట్విట్టర్లో ఇలా వ్రాశారు, 'విద్యుత్ వైఫల్యం కారణంగా,…
ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో విధంగా ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే.. తాజాగా మరో ఘటన ఢిల్లీ మెట్రో గురించి మాట్లాడుకునేలా చేసింది. అదేంటంటే.. ఢిల్లీ మెట్రోలో హాయిగా ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు బీడీ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి స్మోకింగ్ చేస్తున్నప్పటికీ ఎవరూ ఆపకపోవడం విచారకరం. బీడీ తాగుతున్న వ్యక్తిని తోటి ప్రయాణికుడు తన మొబైల్లో బంధించి ఇంటర్నెట్లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సర్వత్రా…
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం గొంది గ్రామ సమీపంలో గత కొన్ని రోజులుగా పులి తన పిల్లలతో సంచరించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పులి తన పిల్లలతో కలిసి అటవీ అంచు గ్రామ సమీపంలోని కాలువ ఒడ్డును తన ఆశ్రయంగా మార్చుకుని చుట్టుపక్కల తిరుగుతూ రైతులను , నివాసితులను భయాందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు. పులుల సంచారంతో పొలం పనులు చేపట్టేందుకు భయపడుతున్నామని పేర్కొన్నారు. పులులను అడవుల్లోకి మళ్లించి మనుషులు, పశువులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని…
ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. అధికారులతో పోలవరం ప్రాజెక్టు, స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. నూతన ఆరోగ్య బీమా పథకం.. మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్ ఆరోగ్య అభియాన్ (MJPJAY)ని ప్రతి ఒక్కరికీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ పథకం వార్షిక ప్రీమియంను 60% పెంచి రూ.3,000 కోట్లకు పైగా పెంచింది. జూలై 1 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. కొత్త ఆరోగ్య బీమా పథకం కింద.. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు 1.5…
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే.
పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పైగురిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 8 మంది మరణించారు. అంతేకాకుండా.. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. కాగా.. ఈ రైలు ప్రమాద ఘటనపై ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ యాదవ్ ప్రశ్నలు సంధించారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ నాయకురాలు మాధవి లత ఆదివారం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో స్లమ్ ఏరియాను పరిశీలించి జీవన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. “ఇక్కడ ఒక స్లమ్ ఏరియా చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. సరైన నీటి సౌకర్యం లేదు. డ్రైనేజీ నీరు , త్రాగునీరు (మిక్సింగ్) కలిసి ఉంటాయి. ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ నీటికి ఔట్లెట్ లేదు. ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి సౌకర్యం లేదు… వెళ్లి ప్రాథమిక పాఠశాల…