హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, బ్లడ్ బ్యాంక్ ల, FSSAI Act అమలు తో పాటు అన్ని విభాగాలను బలోపేతం చేయడానికి ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయడం పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుడ్ సేఫ్టీ పై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించడం వల్ల నాణ్యమైన ఆహారం అందించడంలో దేశంలోనే తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా గుర్తింపు లభిస్తుందన్నారు. నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందేలా ఆహార పరిరక్షణ అధికారులు నిరంతరం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు లోని హాస్టల్స్, క్యాంటీన్ల లతో పాటు అన్ని ఆసుపత్రులలో ఉన్న క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీ పై నిరంతర పర్యవేక్షణ, నిఘా పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
విద్యాసంస్థల తో పాటు ఆసుపత్రిలో ఉన్న క్యాంటీన్లు FSSAI లైసెన్స్ లను తీసుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారాలను ఆదేశించారు. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ లాబ్ ల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.. నాచారంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ను బలోపేతం చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా NHM కు రావలసిన నిధులను విడుదల కు కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో అన్ని విభాగాలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశం.. అన్ని విభాగాలను పట్టిష్ట పరిచేందుకు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.