బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం యువతి అత్యాచారం, హత్య కేసును 48 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దేవరకొండ విజయ్, కారంకి మహేష్, దేవరకొండ శ్రీకాంత్లుగా గుర్తించారు.
హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, బ్లడ్ బ్యాంక్ ల, FSSAI Act అమలు తో పాటు అన్ని విభాగాలను బలోపేతం చేయడానికి ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయడం పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుడ్…
బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(శనివారం) భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేంద్ర బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశానికి ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఈ క్రమంలో స్థూలంగా రాష్ట్రానికున్న అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న ఆర్థిక సహాయం గురించి ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి వెల్లడించారు.
వచ్చేవారంలో పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి నియోజకవర్గానికి రానున్నారు.
వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం కనీస మద్దతు ధర పెంచిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో పండించే వరి మద్దతు ధర కూడా పెరిగిందని, పత్తి పంట పై ఒకే సారి 500 పెంచిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల భర్తీ విషయం లో ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని ఆయన మండిపడ్డారు. జాబ్ కాలెండర్ ను అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు బహిరంగ సభల్లో…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ జరుగుతోంది. ఈ భేటీకి తెలుగుదేశం ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. తొలి పార్లమెంటరీ పార్టీ భేటీ కావటంతో సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని... ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది.
నగరంలో జరుగుతున్న వివిధ రకాల దొంగతనాలను అరికట్టడానికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.. ఇందులో భాగంగానే నిన్న అర్ధ రాత్రి సికింద్రబాద్ లోని మెట్టుగూడ లో డెకాయ్ ఆపరేషన్ చేసి రోడ్డు పక్కన నిద్రించే వారినే టార్గెట్ చేసి వారి సెల్ ఫోన్లు దొంగిలించే ముఠాను అరెస్ట్ చేశారు.. ఈ డెకాయ్ ఆపరేషన్ పై పూర్తి సమాచారం తెలియజేస్తున్న ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మాట్లాడుతూ.. హైదరాబాదులో యాంటీ డెకొయిట్ టీమ్స్…
వర్షాకాలం జ్వరం, జలుబు సమస్యలను పెంచుతుంది. వర్షాకాలంలో హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతలు జ్వరం, జలుబు బారిన పడే అవకాశాలను పెంచుతాయి. దానితో పాటు ముక్కు కారటం, గొంతు నొప్పి, కళ్ళు నుండి నీరు కారడం, చలి వంటి లక్షణాలు ఉంటాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల.. మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే.. మీరు మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి.
మహారాష్ట్రలోని అమరావతిలో ఎయిర్ ఇండియా ఫ్లయింగ్ స్కూల్ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ ఫ్లయింగ్ స్కూల్లో ప్రతి సంవత్సరం 180 మంది పైలట్లకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. పైలట్ల కొరతను ముందే ఊహించి, ఎయిర్ ఇండియా మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక ఫ్లయింగ్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.