Green Papaya: పచ్చి బొప్పాయి అనేక సమస్యలకు దివ్యౌషధం.. ముఖ్యంగా ఈ సమస్యలకు చెక్
- బొప్పాయి పండు రుచికి.. ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం
- పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది
- పచ్చి బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
- గర్భధారణ సమయంలో బొప్పాయి పండు తినకూడదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బొప్పాయి పండు అంటే అందరికీ ఇష్టమే.. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇది రుచికి, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పండిన బొప్పాయి కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటే.. పచ్చి బొప్పాయి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా.. పచ్చి బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. మలబద్ధకం, వికారం నుండి ఉపశమనం అందిస్తుంది. అంతేకాకుండా.. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి మహిళలను రక్షిస్తుంది. అయితే.. గర్భధారణ సమయంలో బొప్పాయి పండు తినకూడదు. పచ్చి బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
CM Revanth: కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగింది..
Also Read
కామెర్లు
కామెర్లు.. వీటిని జాండిస్ అని కూడా పిలుస్తారు. ఇది తీవ్రమైన వ్యాధి. అయితే.. ఈ వ్యాధిని నివారించడానికి పచ్చి బొప్పాయి చాలా మేలు చేస్తుంది. ప్రతి మూడు గంటలకోసారి అరగ్లాసు బొప్పాయి రసం తాగడం వల్ల జాండిస్‌లో ఉపశమనం లభిస్తుంది. బొప్పాయిలో డైజెస్టివ్ ఎంజైమ్ పాపైన్ ఉంటుంది. ఇది ప్రొటీయోలైటిక్ ఎంజైమ్.. దీని నుండి మందులు కూడా తయారు చేస్తారు. ఇవి.. కామెర్లు చికిత్సలో కూడా సహాయపడుతాయి.
ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది
పచ్చి బొప్పాయి యాంటీ పరాన్నజీవి, యాంటీ అమీబిక్.. ఇది ప్రేగు కదలికలతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్, గుండెల్లో మంట మరియు గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది .
ఆస్తమా
బొప్పాయి ఎండిన ఆకులు ఆస్తమాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది . 2022 సంవత్సరంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. బొప్పాయిలో బీటా కెరోటిన్, లైకోపీన్ మరియు జియాక్సంతిన్ వంటి సేంద్రీయ సమ్మేళనాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఆస్తమా నుంచి నివారించవచ్చు.
మలేరియా
పచ్చి బొప్పాయిలో ఉండే విటమిన్ ‘ఎ’, ‘సి’ మలేరియా రోగి యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయి ఆకులను తీసుకోవడం వల్ల మలేరియా, డెంగ్యూ రోగులలో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గుతుంది. ఇది అద్భుతమైన యాంటీ మలేరియా ఆయుర్వేద ఔషధం.
నొప్పి నుండి ఉపశమనం
బొప్పాయిలో ఉండే బీటా కెరోటిన్ శరీరంలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ పనితీరులో సహాయపడుతుంది. ఇది పీరియడ్స్ ని నియంత్రిస్తుంది. అంతేకాకుండా.. ఆ సమయంలో వచ్చే నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!