పోచారం ఐటీ కారిడార్‌లో సైకో వీరంగం.. దాడిలో చిన్నారి మృతి మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో వీరాంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన జగేశ్వర్ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం మునిసిపాలిటీలో…
Family Dispute: కుటుంబ కలహాలతో ఒక భార్య, భర్త నాలుకను కొరికేసింది. ఈ సంఘటన తర్వాత భార్య, గదిలోకి వెళ్లి కొడవలితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝలావర్ జిల్లా బకానీ పట్టణంలో గురువారం జరిగింది. కుటుంబ కలహాలతో కోపంగా ఉన్న మహిళ తన భర్త నాలుకలో కొంత భాగాన్ని కొరికింది.
ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలకు ఈడెన్ గార్డెన్స్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గాయని శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, నటి దిశా పటానీలతో కలిసి ఈడెన్ గార్డెన్స్ సిటీ వేదిక కానుంది.
వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలామంది చల్లటి నీరు త్రాగడానికి ఆసక్తి చూపుతారు. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక చల్లటి నీరు తాగకుండా ఉండలేరు. అయితే.. చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చాలా మందికి తెలియదు. నిజానికి, వేసవిలో వేడినీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
పాక్‌లో ఎన్కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్…
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు100 శాతం పెంపు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. కాగా కర్ణాటక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అదే సమయంలో, కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100 శాతం పెంచడానికి ఆమోదం తెలిపింది. కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు (సవరణ) బిల్లు 2025, కర్ణాటక శాసనసభ సభ్యుల జీతాలు, పెన్షన్లు,…
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై స్పందించారు. తన పేరు ప్రస్తుతం చర్చకు వస్తుండటంపై ఆయన వివరణ ఇచ్చారు. ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా వీడియోను విడుదల చేసిన ఆయన, గతంలో తాను ఓ గేమింగ్ యాప్ యాడ్ చేసిన విషయాన్ని అంగీకరించారు. అయితే, ఆ ప్రకటనను చేయడం తప్పుడు నిర్ణయమని తెలుసుకుని, తానే స్వయంగా ఒప్పందాన్ని పొడిగించకుండా నిష్క్రమించానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల నుంచి రైతుల దాకా అందరినీ మోసం చేసింది తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. బడ్జెట్లో ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పూర్తిగా పక్కన పెట్టిందని ఆక్షేపిస్తూ, ఎన్నికల ముందు వంద రోజులలో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజా బడ్జెట్లో ప్రజలకు మొండిచేయి చూపించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన…
అర్జున్ S/o వైజయంతి థియేట్రికల్ బిజినెస్ అదిరింది నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలోనే ఉన్నఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని…
తిరుమల తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ. నేడు CVSO శ్రీధర్‌ను విచారించనున్న కమిషన్. 21 నుంచి 3 రోజుల పాటు 42 మంది విజిలెన్స్ సిబ్బంది 32 మంది పోలీసులను విచారించనున్న కమిషన్. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు తుది విచారణ. SLBC టన్నెల్లో 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్. గల్లంతైన ఏడుగురి కోసం క్యాడవర్ డాగ్స్‌తో గాలింపు. డీ2, డీ1 ప్రదేశాల్లో మిని జేసీబీలతో తవ్వకాలు. ఆచూకీ…