Buddha Venkanna : ఆరు అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు
- వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్
- మాజీ మంత్రులు పేర్ని నాని
- గుడివాడ అమర్నాధ్ లు మతి భ్రమించి మాట్లాడుతున్నారు
- ప్రజలు ఛీ కొట్టిన వీళ్లు చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారన్న బుద్దా వెంకన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్ లు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఒకరు కోడి గుడ్ల మీద ఈకలు పీకుతాడన్నారు. మచిలీపట్నం లో అత్యధిక మెజారిటీ తో నిన్ను, నీ కుమారుడిని ఓడించారని, ప్రజలు ఛీ కొట్టిన వీళ్లు చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారన్నారు బుద్దా వెంకన్న. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే… జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆయన మండిపడ్డారు. ఆరు అడుగుల నిజాయితీ కి నిదర్శనం చంద్రబాబు అని ఆయన కొనియాడారు. ఐదు అడుగుల తాచుపాము జగన్ అని, ఈ తాచుపాముకు తన మన బేధంలేదు.. ఎవరినైనా కాటేస్తాడన్నారు. వైఎస్, జగన్ లు ఎన్ని విచారణ లు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారన్నారు బుద్దా వెంకన్న.
అంతేకాకుండా..’చివరకి తప్పు కేసులతో చంద్రబాబు ను జైలుకు పంపారు. దేశం మొత్తం, ఇతర దేశాల్లో స్థిరిపడిన వారంతా చంద్రబాబు కు మద్దతు గా నిలిచారు. మీరు చేసిన పిచ్చి పనులకు ప్రజలు మిమ్మలను తరిమి కొట్టారు. ఇంకా అబద్దాలు తోప్రజలను మాయ చేయాలని చూస్తున్నారు. పేర్ని నాని నీ కపట మాటలు మానుకుని బుద్ధి తెచ్చుకో. గుడివాడ అమర్నాధ్ సాక్షి పత్రిక లో వచ్చినవే చెబుతాడు. నెల రోజుల్లో నే రాష్ట్రం లోమార్పు తెచ్చిన మనిషి చంద్రబాబు. అధికారులతో సమీక్ష చేసి, శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. జగన్ ఐదేళ్లల్లో ఎప్పుడు అయినా అధికారులతో ఇలా మాట్లాడారా. కమీషన్ లు, కాంట్రాక్టులలో మామూళ్ల కోసం జగన్ మీటింగ్ లు పెట్టాడు. వైసీపీ నాయకులా సిగ్గు తెచ్చుకోండి… లేదంటే జనం తమిమి కొడతారు.. వైసీపీ లో జగన్ నుంచి కిందిస్తాయి వరకు అందరకీ. పదవీ కాంక్షతో బతుకుతున్నారు, BPCL నేడు చంద్రబాబు పై నమ్మకం తో ముందుకు వచ్చింది. మీ జగన్ ను చూసి పారిశ్రామిక వేత్త లు భయంలొ వెళ్లిపోయారు. కియా, అమర్ రాజా కంపెనీ విషయంలో వాటాలు అడగలేదా. మీవేధింపుల వల్లే గా వాల్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయింది. అత్యధిక మెజారిటీ తో ఓడిపోయిన మీరు ఇప్పుడు సిగ్గు, శరం లేకుండా వాగుతున్నారు. భోగాపురం పనుల్లో పర్సంటేజీలు అడగలేదా మీరు. గుడివాడ అమర్నాధ్, పేర్ని నానిలుకు మైండ్ పోయింది. పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుని మీ కులం వాళ్లతో ఛీ కొట్టించుకున్నారు. మా సీఎం సంయమనం పాటించాలని మమ్మలను ఆపారు. మీరు ఇంకోసారి అబద్దాలు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెబితాం. చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ అమలు చేస్తారు. నెల రోజుల్లో అన్నీ అయిపోవడం సాధ్యమా. మీ జగన్ ఇదే నెల రోజుల్లో పదవులు పంచుకునే పనిలో ఉన్నాడు.
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
చంద్రబాబు ఢిల్లీవెళ్లి నిధుల కోసం కృషి చేస్తున్నారు. మీరు చేసిన అప్పులు, తప్పులు సరి చేయడానికి చంద్రబాబు కష్ట పడుతున్నారు. చంద్రబాబు సంపద సృష్టిస్తారు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. 74 యేళ్ల వయసులో 24 య్ల కుర్రాడిలా చంద్రబాబు పరుగులు పెడుతున్నారు. ముసలి వాడు అంటున్న మీరు ముందు మీ జగన్ ఎప్పుడు బయటకి వచ్చాడో చెప్పండి. నిజమైన ముసలి వాడు, చేవ, సత్తువ లేని వ్యక్తి జగన్. మీ పార్టీ లో నాయకులు మైండ్ పోయి నోటికొచ్చిన విధంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని వాగితే … రోడ్ల మీద తిరగలేరు. మీ రాక్షస పాలన తట్టుకోలేకే మళ్లీ చంద్రబాబు కావాలని ప్రజలు గెలిపించారు. నెల రోజులకే గుండెలు బాదుకుంటే ఎలా… త్వరలోనే సుపారిపాలన ఎలా ఉంటుందో చంద్రబాబు చేతల్లో చూపిస్తారు’ అని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!