పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ కార్యాలయం వేదికగా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి రోజూ ఒకరిద్దరు మంత్రులు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్న టీడీపీ అధినేత సూచించారు. కార్యకర్తలు.. సామాన్య ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు అన్నారు. పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ రాకుండా చూసుకునే బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత దూషణలకు.. భౌతిక దాడులకు దిగకుండా సంయమనం పాటించాలన్న టీడీపీ అధినేత… వైసీపీ తరహాలో టీడీపీ కూడా వ్యవహరిస్తే తేడా ఏముందన్నారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు మాత్రం కచ్చితంగా ఉంటాయని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా.. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదన్నారు. ఇకపై ఎవరైనా తన కాళ్లకు నమస్కరిస్తే.. వారి కాళ్లకు తాను దండం పెడతానని చెప్పారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు. ఇవాల్టి నుంచి ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు.