రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, దీనిపై ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ.. పోలీసుల వైఫల్యం వల్లే నేరాల రేటు పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. లా అండ్ ఆర్డర్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించిన ముఖ్యమంత్రి చాలా అరుదుగా శాంతిభద్రతలపై సమీక్షించారని ఆయన అన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ సాధించగలిగిన పెట్టుబడులు శాంతియుత రాష్ట్రంగా గుర్తింపు పొందాయి. కానీ ప్రస్తుత పరిస్థితి తెలంగాణకు అసాధారణంగా ఉంది. శాంతి భద్రతలు పూర్తిగా…
వరద గోదారమ్మ పోటెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి ముప్పు పొంచి ఉంది. ఆదివారం సాయంత్రానికి ఆ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. అనేక పల్లపు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. అయితే ఈ వరద నీరు మరింత పెరిగితే ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువ ప్రాంతంలో వరదనీటి ఉదృతి తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికి ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా.. రాష్ట్రప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా.. ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసి 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టునకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం…
మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పోలీసులు 2024 జనవరి 1 నుండి 2024 జూలై 25 వరకు 21,193 మొబైల్ పరికరాలను విజయవంతంగా రికవరీ చేసి, దేశంలో రెండవ స్థానంలో నిలిచారు. మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డి ఓ టి) సి ఈ ఐ ఆర్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్‌ను అధికారికంగా 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణ…
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. కొడంగల్‌లో భారీ వంటశాల ఏర్పాటు చేసేందుకు హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మెగా వంటశాల ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 28 వేల మంది పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నారు. ఇవాళ హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా…
అంబేద్కర్ కోసం జిల్లా గంటి పెదపూడి పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పడవ ప్రమాదంలో గల్లంతైన బాధ్యత కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. నదిలో వరద ఉధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ జైపాల్ రెడ్డి ఒక సిద్ధాంతకర్తగా పనిచేశారని, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది,కానీ అధికారంలోకి రాలేదన్నారు. 2014 ఎన్నికల్లో స్వర్గీయ జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రకటించినుంటే అధికారంలోకి…
ఏఐఎంఐఎం ఫ్లోర్‌లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీకి కొండంగల్ సీటును ఆఫర్ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బోనాల పండుగలో పాల్గొనేందుకు పాతబస్తీకి వచ్చిన సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒవైసీ పోటీ చేస్తే డిపాజిట్ గల్లంతు అవుతుందని అన్నారు. అవాస్తవ లక్ష్యాల కోసం ఒవైసీ తెలంగాణ బడ్జెట్‌ను తుంగలో తొక్కారు. ఓడిపోయేలా చూస్తాం అని అన్నారు. ఎఐఎంఐఎంను అవకాశవాద పార్టీగా…
ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పై శ్రీలంక విజయం సాధించింది. దీంతో.. ఆసియా కప్ 2024 విజేతగా శ్రీలంక మహిళల జట్టు అవతరించింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది శ్రీలంక ఉమెన్స్.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు 2024 జనవరి 1 నుండి 2024 జూలై 25 వరకు 21,193 మొబైల్ పరికరాలను విజయవంతంగా రికవరీ చేసి, దేశంలో రెండవ స్థానంలో నిలిచారు. మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డి ఓ టి) సి ఈ ఐ ఆర్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్‌ను అధికారికంగా 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పోర్టల్ 2023 ఏప్రిల్ 19 నుండి ప్రయోగాత్మకంగా…