ఈరోజు లక్షన్నర రుణ మాఫీ చేయడం శుభ పరిణామమని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తొందర్లోనే మిగతా వారికి కూడా రుణ మాఫీ చేయాలన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం కళ్ళాల వద్దే కొనాలని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా దరిద్రంగా తయారైందని, ధరణి వల్ల భూముల్లో గందరగోళం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అందులో మార్పులు చేయాలంటే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాలని, ధరణి సమస్యను తొందర్లోనే కొలిక్కి తేవాలన్నారు వెంకటరమణ రెడ్డి. రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న Vra కుటుంబ సభ్యులకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని, పంచాయతీల్లో కింది స్థాయి ఉద్యోగులు చాలా కీలకమన్నారు.
Train Accident: జార్ఖండ్ రైలు ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి.. రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా
అంతేకాకుండా..’గ్రామీణ ప్రాంతాల్లో కింది స్థాయి ఉద్యోగులను నియమించాలి. ప్రభుత్వ స్కూల్స్ కి కొత్త బిల్డింగ్స్ కట్టాలి. ప్రయివేట్ స్కూల్స్ దీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను తీర్చి దిద్దాలి. నాకు ఒక ప్రైవేట్ స్కూల్ అవసరమైతే దాన్ని మూసివేసేందుకు నేను సిద్ధం. సీఎం కుమారుడి నుంచి బంట్రోతు కొడుకు వరకు ప్రభుత్వ స్కూల్స్ లో చదవాలనే ఆలోచన వచ్చే విధంగా ప్రభుత్వ స్కూల్స్ తయారు చేయాలి. 317, 46 జీవో లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మాజీ ఎమ్మెల్యే లకు సెక్యూరిటీ తీసేశారు. వారికి తిరిగి గన్ మెన్ లను కేటాయించాలి. రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారులకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. అసెంబ్లీ మార్గదర్శకంగా నడవాలి. అసెంబ్లీ నడుస్తుంటే సభ సంస్కారాలు పాటించాలి. సభ్యుడు చెప్పేది అందరూ వింటే మాట్లాడే వ్యక్తికి ఉత్సహం వస్తది. నేను ఎంఎల్ఏ అవ్వడం కాస్త ఆలస్యం అయ్యింది. నేను వంకర తోవలో గెలవాలి అంటే ఎప్పుడో ఎంఎల్ఏ అయ్యేవాడిని. సైటైర్లు నేను కూడా వేయగలను. కానీ అది నా సంస్కృతి కాదు. ఇక్కడ మాట్లాడే అవకాశం రానందున మీడియాలో పాయింట్ లో సభ గురించి మాట్లాడాను.’ అని ఎమ్మెల్యే వెంకట రమణరెడ్డి అన్నారు.
Rafale Jets: రాకెట్ దూసుకెళ్తుండగా తోడుగా వెళ్లిన రఫేల్ యుద్ధ విమానాలు.. వీడియో వైరల్