కేబినెట్లో మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని సీఎం తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు.
మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదు.. మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదని మాజీమంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ కాంగ్రెస్సే మోడీకి బీ టీమ్ గా పని చేస్తోందని అన్నారు. రేవంత్ సీఎం కావడం మోడీ చాయిసే అన్నారు. వాల్మీకి కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నా బీజేపీ…
అనధికార నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ గ్రేటర్ హైదరాబాద్ అధికారులు బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటి), ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన దామరచెరువు చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లో రెండు కళాశాలలు అక్రమంగా నిర్మించారనే ఆరోపణలున్నాయి. ఈ…
దేశవ్యాప్తంగా 234 నగరాల్లో కొత్తగా ఎఫ్.ఎమ్ రేడియో సౌకర్యం కల్పించనుంది. అందులో భాగంగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరిన్ని ఎఫ్.ఎమ్ రేడియో కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
రైతులను అయోమయానికి గురిచేస్తూ రుణమాఫీ అమలుపై మంత్రులు చేస్తున్న వివాదాస్పద ప్రకటనలను ఎత్తిచూపుతూ, రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి కాంగ్రెస్ అవాస్తవాలు, తప్పుడు వాగ్దానాలే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం అన్నారు. రైతులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు మొత్తం రూ.31000 కేటాయించి రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి ప్రకటించగా, ఆగస్టు 15లోగా మాఫీ పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని మరో మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి మాటను ఖండిస్తూ ఆర్థిక మంత్రి ఇప్పటి వరకు…
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో అమానుష ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తున్న మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా ఆ బాలికపై కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. అంతేకాకుండా.. అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. నిందితులు సంతోష్ నాయక్, అజయ్, సుభాష్ మైనర్లుగా గుర్తించారు. కాగా.. ఈ వీడియోలు వైరల్ కావడంతో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ వేములవాడ లో 300 MTS గోదాం, Kdccb వేములవాడ శాఖ నూతన భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. 2009 లో కరీంనగర్ ఎమ్మెల్యే కావాలని అనుకున్న వైఎస్ఆర్ ఎంపీగా పోటీ…
వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె.. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను జగన్‌కు పంపినట్లు తెలుస్తోంది. కాగా.. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సునీత తెలిపింది.
ఒకప్పుడు మేమే కింగ్‌లమని అన్నారు. మా మాటకు ఎదురే లేదంటూ రీ సౌండ్ ఇచ్చారు. తీరా.. ఇప్పుడు బయటికి వస్తే డబ్బులు ఖర్చు అనుకుంటూ.. కామ్ సినిమా చూస్తున్నారు. అసలే కష్టాల్లో ఉన్నాం... డీజిల్ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయ్... ఇప్పుడెందుకు రా బుజ్జా అన్ని బళ్ళు... అంతా కలిసి ఒక బండిలో సర్దుకోండన్న పాపులర్ మూవీ డైలాగ్‌ని గుర్తు చేసుకుంటూ... జాగ్రత్త పడుతున్నారట. ఎవరా లీడర్స్? ఏంటి వాళ్ళకు వచ్చిన కష్టం.
తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల అయింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకొచ్చారు. లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది.