ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా.. పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ భూకంపం ఉదయం 11:26 గంటలకు సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7 గా నమోదైంది.
గత వారం జరిగిన సమీక్షలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు. దానికి అనుగుణంగా అధికారులు అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేశారు. అందులో కొన్ని తేడాలు ఉండడంతో మరిన్ని మార్పులను ముఖ్యమంత్రి సూచించారు. ఆ మార్పులకు అనుగుణంగా అలైన్మెంట్ మార్చాలని… అది ఫైనల్ అయిపోతే తర్వాత కార్యాచరణ వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించనున్న . ప్రతిపాదిత రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సమీకరణ,…
కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలపై కీలక చర్చ.. కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని సీఎం తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులే గైడ్ చేయాలని సూచించారు. ఇకపై ఇలాంటివి…
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఈ సందర్భంగా కవితపై పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపించాయి. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసిన కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో సాయంత్రం జూబ్లీహిల్స్‌ని నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని ఆమె అన్నారు.…
చెక్కులు స్థానిక ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే అందించాలని హై కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మంత్రి పొన్నం కావాలనే అధికారులను తప్పు దోవ పట్టిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే పంపిణీ చేయాల్సి ఉండగా చెక్కుల పంపిణీ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకొని ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. అవగాహన లేక ఎమ్మార్వో కార్యాలయాల్లో చెక్కుల…
ఈ రోజు కేంద్రం నుండి విడుదలైన రూ.12 వేల కోట్లు గతంలో వైఎస్ జగన్ చేసిన కృషి వల్లే వచ్చాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అసత్యాలను చెప్తున్నారన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడ్డారని.. అందుకే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.
కవిత బెయిల్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల స్పందనపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవితకు బెయిలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలది అనైతిక వాదన అని ఆయన తెలిపారు. వీళ్ల రాజకీయం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో కవిత మీద మోపబడిన అభియోగాలకు ఎలాంటి నైతికత లేదు అని, కేవలం రాజకీయ కక్ష్యతో మోపబడిన…
పోలవరంకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో.. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ, పోలవరం విషయంలో కేంద్రం చొరవ చూపుతోందని అన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారానే చెబుతోందని తెలిపారు. కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోందని.. పోలవరాన్ని…
ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కె. కవిత బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమెను బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది . శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. తీహార్ జైల్లో ఉన్న కవిత దాదాపు ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు…