బుద్ధభవన్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఎంపీ అనిల్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరుపై ఎంపీ అనిల్ హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాకు తన ఎంపీ లాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు అనిల్ యాదవ్ కేటాయించారు. 25 లక్షలు కేటాయిస్తూ లేఖను కమిషనర్ రంగనాథ్‌కు అనిల్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోనీ చెరువులు కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారని,…
ముంబై సినీ నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంపై విచారణ అధికారిని బెజవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నియమించారు. విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రవంతిని విచారణ అధికారిగా నియమించారు. ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని వస్తున్న వార్తలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలనీ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలుగు వాడినైనందుకు ఎంతో గర్వపడుతున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భాషా ప్రాచీనతకు శాసనాలు మూలాధారాలు అని ఆయన తెలిపారు. చక్కటి తెలుగు సాహిత్యానికి పెట్టింది పేరు ప్రొద్దుటూరు అన్న వెంకయ్య... అనేకమంది పండితులు అనేక రచనలు చేసిన వారు ఈ ప్రాంతం వారేనన్నారు. భారతం, భాగవతంలోని ఎన్నో శ్లోకాలకు వ్యాఖ్యానాలు రాసిన రచయితలు ఈ ప్రాంతం వారేనన్నారు.
అబుదాబి యువరాజు ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వచ్చే నెల (సెప్టెంబర్)లో భారత్‌లో పర్యటించనున్నారు. కాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదుపరి నాయకత్వం కోసం నహ్యాన్ పోటీదారుగా ఉన్నారు. పర్యటనలో భాగంగా.. భారతదేశం-యుఏఈ మధ్య వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చల కోసం భారత్ కు రానున్నట్లు తెలుస్తోంది. షేక్ ఖలీద్ సెప్టెంబర్ 8న భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.
ఎస్సీ వర్గీకరణ కోసం 1994 లో స్టార్ట్ చేసామని, గజ్వేల్ కేంద్రంగా ఎస్సీ వర్గీకరణ ఆద్యం పోసిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం జర్నలిస్ట్ ల సేవలు మరచిపోలేమని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత దళితుల్లో విభజన అవసరమా లేదా అనే చర్చ మొదలైందని, అమరవీరుల త్యాగం తో ఏర్పాటు అయింది తెలంగాణ అని ఆయన అన్నారు. ఏ రాష్ట్రములో లేని…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్ ఉంటుంది. అయితే తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. భక్తులకు కోరినన్ని లడ్డూల జారీ విధానంపై టీటీడీ ఆంక్షలు విధించింది.
చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా, ఓ.ఆర్.ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రా కు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. చెరువుల…
టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ దుర్మార్గపు చర్యలు నచ్చక పోవడం కారణంగానే పలువురు నాయకులు పార్టీ వీడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. జగన్ స్వయంకృత ఫలితం కారణంగానే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.