Bhatti Vikramarka : సబ్ ప్లాన్ చట్టాన్ని వంద శాతం అమలు చేయాల్సిందే
- ఎస్సీ ఎస్టీల జీవితాల్లో వెలుగులో నింపాలని సబ్ ప్లాన్ చట్టం తీసుకువచ్చిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం
- సబ్ ప్లాన్ చట్టం స్ఫూర్తిని కొనసాగించే విధంగా అధికారులు పని విధానం ఉండాలి
- సబ్ ప్లాన్ చట్టం అమలుకు మేధోమథనం చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు ఆదేశం
- ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులు- ప్రణాళికల సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్సీ ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని వంద శాతం పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు- ప్రణాళికల గురించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చిన స్ఫూర్తిని కొనసాగించే విధంగా అధికారుల పని విధానం ఉండాలని దశ దిశా నిర్దేశం చేశారు.
అన్ని శాఖల్లో ఉన్న అధికారులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అర్థం చేసుకొని చట్టం ప్రకారం వారి నిధులను వారికే ఖర్చు పెట్టాలని సూచించారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సీరియస్ గా అమలు చేయడానికి ఉన్నత అధికారులు సాధ్య సాధ్యాల ను దృష్టిలో పెట్టుకొని మేధోమధనం చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని అమలు చేసి దళిత గిరిజన జీవితాల్లో మార్పు తీసుకువస్తేనే ఆ చట్టానికి అర్థం, పరమార్థం ఉంటుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి సబ్ ప్లాన్ చట్టాన్ని ఎంత సీరియస్ గా అమలు చేయాలో ఉన్నత అధికారులు మనసుపెట్టి ఆలోచన చేయాలన్నారు.
Kangana Ranaut: “అత్యాచారాలను చిన్నచూపు చూడటం సర్వసాధారణమైంది”
Also Read
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత అన్ని శాఖల అధికారులకు నిధుల కేటాయింపు, ఖర్చు పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేటాయించే విషయంలో అధికారులు విద్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేటాయించాలని తర్వాత కమ్యూనిటీ హాల్స్ అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణాల కోసం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎస్సీ ఎస్టీల భూములను అభివృద్ధి చేయడానికి ఇందిరా జల ప్రభ పథకం అమలు కోసం అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు దళిత, గిరిజనుల వ్యవసాయం కోసం కావలసిన నీటి వనరులను సమకూర్చడానికి బోర్లు వేయించాలని, భూగర్భ జలాలు పెరగడానికి చెక్ డ్యాముల నిర్మాణం చేయాలని చెప్పారు. పోడు సాగు చేసుకునే ఆదివాసి రైతులకు ఆదాయం వచ్చే విధంగా , అడవిని కాపాడుకునే విధంగా ఫామ్ ఆయిల్, పండ్ల తోటల పెంపకం, అంతర్గత పంటల సాగుకు డిజైన్ చేయాలని సూచించారు. అడవి – ఆదాయం రెండు ఉండే విధంగా కొత్త పథకాలను తీసుకురావాలని సూచించారు.
Maharashtra: ట్యూషన్ క్లాస్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. కీచక గురువును చితకబాదిన స్థానికులు
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కేటాయింపు, నిధుల ఖర్చు గురించి అధికారులను అడిగి ఆరా తీశారు. గతం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారంగా 24 శాతం నిధులు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టడానికి అధికారులు కచ్చితంగా దృష్టి సారించాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన తర్వాత ప్రతినెల సబ్ ప్లాన్ చట్టం అమలు, నిధుల వ్యయంపై శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి ఆర్థిక శాఖ నుంచి పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానీయా, ఎనర్జీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్, సోషల్ వెల్ఫేర్ కమిషనర్ శ్రీదేవి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ శరత్, హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డి గౌతమ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!