తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా.. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు. అందులో భాగంగా.. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వాలని.. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి మరోసారి షాక్ తగిలింది. 39వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) సమక్షంలో గాయత్రి నగర్‌లోని పురంధేశ్వరి నివాసంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈనెల 29న బంగారు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. దేవస్థానం వైదిక కమిటీ సూచనతో ప్రతీ మాసంలో శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫాం హౌస్‌కు ఇరిగేషన్ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో.. ఫాం హౌస్‌లో అధికారులు కొలతలు వేస్తూ పరిశీలించారు. కాగా.. గత కొద్దీ రోజులుగా జన్వాడ ఫాం హౌస్‌కు సంబంధించి చర్చ జరుగుతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తికి అందేలాగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారులకు సూచించారు. పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న వారికే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అట్టడుగు వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలాగా చూడాలని గవర్నర్ సూచించారు.
కవితపై ఈడీ కేసుపై కవిత న్యాయవాది మోహిత్ రావు మాట్లాడుతూ, ఈడీది పూర్తిగా అసంబద్ధ దర్యాప్తు అని ఆరోపించారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో అరెస్టు అయిన తర్వాత ఇచ్చిన వాటిని మాత్రమే దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకుందని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వారు కేసులో నిందితులుగా కూడా లేరని అన్నారు. సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు.
ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
ప్రపంచం విభిన్న నైపుణ్యాలు కలిగిన విద్యార్థుల కోసం ఎదురుచూస్తోందని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 12వ స్నాతకోత్సవాన్ని శనివారం వర్సిటీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ల విజయాన్ని జరుపుకోవడానికి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు రావడం చాలా గర్వంగా, ఆనందంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు పంపారు.