మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. నగరశివారులోని 15 చెరువుల ఆక్రమణ పై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ అక్కడికి వెళ్లారు. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సాయంత్రం వేళ పర్యటించారు. ఫాక్స్ సాగర్, దూలపల్లి అశోక్ విల్లాస్ దగ్గర నాలా కబ్జాను, పలు చెరువులను ఆయన పరిశీలించారు.
మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన అన్న క్యాంటీన్లను అక్టోబర్‌లో ఏర్పాటు చేస్తామన్నారు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిల్ పై విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి చెప్పే వరకు తెలియదు.. కానీ కవిత బెయిల్ పై మూడు నాలుగు రోజుల నుండి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసిందని తెలిపారు. కేటీఆర్ రెండు రోజుల ముందే ఢిల్లీలో హడావుడి చేశారని.. జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ బీఆర్ఎస్ చెప్పేసిందని పేర్కొన్నారు.
దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో దేవదాయ శాఖపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం ఎండో, ఫారెస్ట్, టూరిజం మంత్రులతో కమిటీ వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో కలయికలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగినట్టు సమాచారం. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు చోటు కల్పించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ప్రతిపాదించినట్టు తెలిసింది.
తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవ ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ విత్ డ్రా గడువు ఈరోజుతో ముగిసింది. కాగా.. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.
కాసేపట్లో తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల కానుంది. లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది. కవిత భర్త, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించిన షూరిటీ బాండ్లను స్వీకరించి కవితను విడుదల చేయాలని వారెంట్ ఇచ్చింది. కాగా.. కవిత విడుదలకు ప్రాసెస్ జరుగుతుంది.
YS Jagan: ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రజారోగ్య రంగానికి ప్రభుత్వం ఉరితాడు బిగిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాదులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సర్వే ప్రారంభించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 7ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లి గూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలలో వీటి ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు.