Etela Rajender : గెలుపు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలవడమే కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గెలుపు అంటే ఎంపీలు, ఎమ్మేల్యేలు గెలవడమే కాదని, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు అందులో ఒకరు తెలంగాణ నుంచి గెలిచారు. మరొకరు గుజరాత్ నుంచి గెలిచారని, గుజరాత్ లో పార్టీ అధికారంలోకి వచ్చింది.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామన్నారు ఈటల రాజేందర్. 46 ఏళ్ల తర్వాత తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచామని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటు షేర్ తేడా కేవలం 4 శాతం మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో పెట్టిన ఎఫర్ట్ పెట్టాలని, అన్ని లోకల్ బాడీ ఎన్నికల ప్రాధాన్యత గుర్తించాలన్నారు. కేసీఆర్ చీ అనిపించుకోవడానికి ఆరేళ్ళు పట్టింది… ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో చీ కొట్టించుకోవడానికి 9 నెలలు కూడా పట్టలేదని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణా ప్రజల విశ్వాసం కోల్పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి అయినట్లు మాట్లాడుతున్నారని, తాత్కాలికంగా విజయం సాధించవచ్చన్నారు ఈటల రాజేందర్.
Ustaad Bhagat Singh: పవన్ ఫాన్స్ రెడీగా ఉండండమ్మా…
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అంతేకాకుండా..’సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్న వారికి N కన్వెన్షన్ మాత్రమే మీకు కనిపిస్తుంది. హస్మత్ చెరువు కింద 120 మంది పేదలకు నోటీసులు ఇచ్చారు. ఫిరంగి నాల ముసుకుపోయింది. చెరువుల్లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములు కావు. పేదల ఇండ్లు కులగొట్టడం మీ తరం కాదు. పేదల జోలికి వస్తే ఖబడ్దార్. ప్రత్యామ్నాయంగా ఇండ్లు కట్టించు ఇచ్చి మాట్లాడాలి. రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో తేలిపోవడం ఖాయం. రేవంత్ రెడ్డి చిట్టా రాస్తున్నాం.. సందర్భం వచ్చినప్పుడు బయటకు తీస్తాం. తెలంగాణ వాళ్లకు పాలించడం చేతకాదని హేళన చేసేవాళ్ళు.. రేవంత్ రెడ్డిని చూస్తే అదే నిజం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కి న్యాయ స్థానాలను గౌరవించడం కూడా తెలియదు. సుప్రీం కోర్టు తీర్పు పై సిఎం హోదాలో మాట్లాడటం బాధాకరం.’ అని ఈటల రాజేందర్ అన్నారు.
Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!