కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తు్న్నారు. .. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్ ఫ్లో 2,86,434 క్యూసెక్కులు ఉండగా.. 10 గేట్లు ఎత్తడంతో ఔట్ ఫ్లో 3,48,235 క్యూసెక్కులుగా ఉంది.
దేశంలో నాల్గవ భాష తెలుగు, పదికోట్ల మంది మాట్లాడే భాష తెలుగు.. అమెరికాలో తెలుగు 11వ భాష.. అదీ తెలుగువారి సత్తా.. అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు గొప్పదనం గురించి కొనియాడారు. తెలుగు భాషా దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు.
రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఇటీవల మరణించిన ఊరగొండ రాజు కుటుంబాన్ని కేంద్ర హోoశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నేత కార్మికుల కరెంటు బిల్లుల విషయంలో గత ప్రభుత్వం, కొత్త ప్రభిత్వం మోసం చేసిందన్నారు. నేత కార్మికులకు రెండు పార్టీలు కలిసి 50 శాతం సబ్సిడీ ఇస్తామని మోసం చేశారని, ప్రభుత్వానికి మేము సలహాలు సూచనలు ఇస్తే మాపై నిందలు మోపుతున్నారన్నారు బండి సంజయ్. నేత కార్మికులు…
మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ నియామకం ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్‌లు ఉండనున్నారు. ప్రస్తుతమున్న మద్యం పాలసీని కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను…
గోధుమ పిండితో తయారు చేసిన చపాతీ భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. చాలా మంది చపాతీని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. బరువు పెరగడం లేదా తగ్గడం విషయానికి వస్తే.. గోధుమ రొట్టె వినియోగం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే ప్రశ్న తరచుగా ప్రజల మనస్సులో తలెత్తుతుంది. ఇది బరువును పెంచుతుందా లేదా బరువు తగ్గడంలో సహాయపడుతుందా..?
గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణేష్ నవరాత్రి ఉత్సవాలను సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలన్నారు. అందరి సలహాలు, సూచనలు స్వీకరించెందుకే ఈ సమావేశం నిర్వహించామని, నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశిస్తున్నానని ఆయన తెలిపారు. చిత్తశుద్ధి, నిబద్దతో ఉత్సవాలు నిర్వహించేలా జాగ్రత్త వహించండని,…
భారతీయ ఆహారంలో అన్నం ఒక ముఖ్యమైన భాగం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దీనిని అనేక రకాలుగా తింటారు. కానీ అన్నం వినియోగానికి సంబంధించి, అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా.. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి లేదా బరువును నియంత్రించుకోవడానికి ప్రజలు తరచుగా అన్నం తినడం మానేస్తారు.
మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ స్కీంల అమలు, అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతపరచాలని, అంగన్వాడి టీచర్లతో పాటు ఆయాలకు సైతం శిక్షణ కార్యక్రమాలు తరచు నిర్వహించాలన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీలో చిన్నారులకు ఇస్తున్న కోడి గుడ్డును రెండు ముక్కలుగా చేసి ఇవ్వాలని, అప్పుడే చిన్నపిల్లలకు తినడానికి అనువుగా…
విజయవాడ, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులు ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. విజయవాడ, విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులు రెండు దశల్లో చేపట్టాలని భావిస్తున్నామన్నారు.
రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. పార్లమెంట్లో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్కు రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించినట్లు ప్రకటన వెలువడింది.