ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. అందులో భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క స్థానం కోల్పోయాడు. బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకోగా.. యశస్వి ఒక్క స్థానం సాధించి ఏడో స్థానానికి చేరుకున్నాడు.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులకు సిద్ధమైంది. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్కు సిఫారసు చేసింది హైడ్రా. హెచ్ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. Chicken Biryani: బిర్యానీ తినండి, లక్ష పట్టుకెళ్లండి.. ఓ రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అక్రమ నిర్మాణదారులకే కాదు.. నిబంధనలకు…
జగన్ను రాజకీయంగా అడ్డు తొలగించుకోవడం కోసం మొదటి నుంచి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని మాదీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ ఆషాఢ భూతి అని.. నమ్ముకున్న వాళ్లను ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళని ఆషాఢ భూతి అంటారని ఆయన అన్నారు.
ఎస్సీ ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని వంద శాతం పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు- ప్రణాళికల గురించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్ ప్లాన్ చట్టాన్ని…
పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త తెలిపింది. ఈ నెల 31వ తేదీ నాడే పింఛనుదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో వృద్ధాప్య, వితంతువు, ఇతర పింఛన్లను ఈ నెల 31వ తేదీనే ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.
హరీష్ రావు చిట్.. చాట్ సోది చాట్ లాగ ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు చీప్ పాలిటిక్స్ కు తెరలేపుతుండు అని ఆయన ఆరోపించారు. మూసి నదిపై ఆక్రమంగా కట్టిన కట్టడాలను కూలగొడితే బీఆర్ఎస్ నాయకులకు వచ్చిన నష్టం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పది ఏండ్లలో చేయలేని పని.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఈర్శ తో హరీష్ రావు…
బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి..! క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి.. అంతర్జాతీయ రెడ్ శాండల్ స్మగర్గా పేరున్న కొల్లం గంగిరెడ్డి.. చూపు ఇప్పుడు బీజేపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది.. ఆయన త్వరలోనే బీజేపీ కండువా కప్పుకుంటారనే వ్యవహారం.. బీజేపీలో వివాదాస్పదంగా మారందని.. కొందరు ఈ పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.. కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నారు అనేది ప్రచారం మాత్రమేనన్న ఆమె.. ఆ…
సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త నిబంధనలు, మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు జారీ చేసిన మినహాయింపులను రద్దు చేసింది. వచ్చే ఏడాది హజ్ యాత్రలో చాలా మార్పులు కనిపించబోతున్నాయి. అందులో ప్రధానంగా వయస్సు మార్పు. ఇందులో రిజర్వ్ కేటగిరీ వయస్సు 70 నుండి 65 సంవత్సరాలకు తగ్గించారు. మరొకటి.. హజ్ యాత్రలో భార్యాభర్తలు కలిసి ఒకే గదిలో ఉండకూడదనే పరిమితి విధించింది.
ఏపీ రాజధాని అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్పురణకు వచ్చేలా అమరావతి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరులో మొదటి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు.
మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.