ఎమ్మెల్యే కారును కడిగిన పోలీసు.. వీడియో వైరల్. మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ పోలీసు తన కారును కడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నలు సంధించారు. విశేషమేమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సప్కల్ కూడా వీడియోను…
ఏపీలో పలువురికి నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు రాగా.. వారికి పోస్టింగులు కూడా కేటాయించారు. ఏఎస్పీలుగా ఉన్న ఏడుగురికి నాన్ కేడర్ ఎస్పీలుగా ప్రమోషన్లు లభించాయి.
2026 మార్చి నాటికి పూర్తి చేస్తాము. సోనియా గాంధీ తో ప్రారంభిస్తాం అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు 300 రోజుల పాటు నీటి యెత్తిపోసేలా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం అన్నారు.. పెండింగ్ బిల్ అన్ని క్లియర్ చేస్తాం అన్న మంత్రులు.. పొరుగు రాష్ట్రాల తో సత్ సంబంధాలతో ఉంది త్వరితగతిన ప్రాజెక్టు పనుల చేపడతాం అన్నారు. గత ప్రభుత్వం కేవలం పనులు చేశారు జేబులు నింపుకున్నారు కానీ…
కృష్ణా జిల్లా గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
రెండు రోజుల క్రితం గాజుల రామారంలో కాల్పులు జరిపిన నిందితులను 48 గంటలలో పట్టుకొని మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు.. 27 తారీఖు అర్థరాత్రి గాజుల రామా రం LN బార్ దగ్గర పెట్రోల్ దొంగలిస్తూ జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో అనుచరుడు శివ కంట్రీమేడ్ తుపాకీతో బార్ సిబ్బందిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి తార్ వాహనంతో గుద్ది చంపాలని ప్రయత్నించడం బార్ సిబ్బంది గాయాలతో తప్పించు కొని పోలీసులకు ఫిర్యాదు చేసారు..…
గెలుపు అంటే ఎంపీలు, ఎమ్మేల్యేలు గెలవడమే కాదని, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు అందులో ఒకరు తెలంగాణ నుంచి గెలిచారు. మరొకరు గుజరాత్ నుంచి గెలిచారని, గుజరాత్ లో పార్టీ అధికారంలోకి వచ్చింది.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామన్నారు ఈటల రాజేందర్. 46 ఏళ్ల తర్వాత తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచామని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్,…
తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని వైసీపీ రాజ్యసభ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. మా రాజ్యసభ సభ్యులు ఇంకెవరూ రాజీనామా చేయడం లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం ముందు నుంచి తాను జగన్ వెంట ఉన్నానని.. మంత్రి పదవి వుండగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచానని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.