ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 నుంచి పీవీ సింధు అవుట్..! ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రెండు ఒలంపిక్స్ పథకాల విజేత భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోటీ నుంచి నిష్క్రమించింది. నేడు (మే 5) జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో థాయ్‌లాండ్ కు చెందిన వరల్డ్ నంబర్ 8 పోరన్ పావీ చోచువాంగ్ చేతిలో ఓటమి పాలైంది. మొత్తం 78 నిమిషాలు పాటు సాగిన ఆట.. మూడు గేమ్‌ల పాటు…
హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ అల్ప్రాజోలం ట్యాబ్లెట్స్.. హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ అల్ప్రాజోలం ట్యాబ్లెట్స్ పట్టుబడ్డాయి.1లక్ష 80 వేల ట్యాబ్లెట్స్ ని ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ కాగా, పరారీలో మరొకరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అల్ప్రాజోలం కేసులో ముగ్గురిపై ఎక్సైజ్ పోలీసులు కేసునమోదు చేశారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి మాట్లాడుతూ.. ‘నిబంధనలకు విరుద్ధంగా మెడిసిన్ సప్లై చేస్తున్న ముఠా ను అరెస్ట్ చేశాము..1.8 లక్షల ఆల్ఫా…
నేడు బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్.. ఇక ఎర్ర సముద్రమే! 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్లో భంగపడ్డ ఆర్సీబీ.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో…
ఇరాన్లో కిడ్నాపైన ముగ్గురు భారతీయులు క్షేమం.. రక్షించిన టెహ్రాన్ పోలీసులు ఇరాన్లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు సురక్షితంగానే ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ముగ్గురు భారతీయులను టెహ్రాన్ పోలీసులు సురక్షితంగా రక్షించినట్లు చెప్పింది. దీంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు. పంజాబ్‌కు చెందిన హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్పూర్) వాసులు మే 1న ఇరాన్ వెళ్లారు. హోషియార్పూర్ ఏజెంట్ సాయంతో ఇరాన్ వెళ్లారు. ఇరాన్‌లోకి అడుగుపెట్టగానే దుండగులు…
అమరావతి: నేడు బెంగళూరుకు వైఎస్ జగన్. మధ్యామ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు జగన్. అమరావతి: వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సందర్భంగా కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టునున్న వైసీపీ శ్రేణులు. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి. హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణలు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు. కోస్తా జిల్లాల్లో 39-40 డిగ్రీల…
కాంగ్రెస్ చట్టాలు రైతులకు మేలు చేస్తే.. బీఆర్ఎస్ చట్టాలు ప్రజలకు ఇక్కట్లను తెచ్చాయి తెలంగాణ ఆవిర్భావం జూన్ 02 రోజున భూ భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భూ సమస్యలను లేకుండా చేసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భూ భారతి చట్టం చరిత్రాత్మకం అని అన్నారు.…
భారీగా పేలిన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు..! ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న ప్రసిద్ధ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మళ్లీ భారీగా పేలింది. అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవడంతో, పెద్ద మొత్తంలో బూడిద మేఘాలు ఆకాశంలో ఏర్పడ్డాయి. పేలిన అగ్ని పర్వతం అగ్నిని, బూడిదను పొగలను వెదజల్లుతూ సమీప ప్రాంతాలను కమ్మేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో పర్వతం వద్ద ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. పక్కనుంచి బూడిద మేఘం విరుచుకుపడుతుండగా తమ ప్రాణాల కోసం…
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకావొద్దని కేసీఆర్ నిర్ణయం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదురుగా విచారణకు ఈ నెల 5వ తేదీన హాజరు కావడం లేదు అని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అయితే, విచారణకు మరింత సమయం కావాలని కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ ను ఆయన కోరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే, ఈ విషయాన్ని కాళేశ్వరం కమిషన్…
Karnataka: కర్ణాటక బెళగావిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆరుగురు నిందితులు బాలికపై రెండుసార్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఈ చర్యని వారు మొబైల్ ఫోన్లో వీడియో తీసి బాలికను బ్లాక్మెయిల్ చేశారు. ఈ బ్లాక్మెయిల్ బాలిక రెండోసారి గ్యాంగ్ రేప్‌కి గురవ్వడానికి కారణమైంది.
‘ఉగ్రవాది లఖ్వీ జైలులో ఉండగా తండ్రయ్యాడు’.. ఉగ్రవాదంలో పాక్ ప్రమేయాన్ని వివరించిన ఓవైసీ ‘ఆపరేషన్ సింధూర్’ విజయం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తన వైఖరిని ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలు వివిధ దేశాలకు వెళ్లి, ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్న తీరును బయటపెడుతున్నాయి. ఈ ఎపిసోడ్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలను…