తెలంగాణలో ప్రజా పాలనకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి నిత్యం అప్పులను ఎలా తీర్చాలి.. నిధులు ఎలా తెచ్చుకోవాలి అని సీఎం ప్రయత్నం చేస్తుంటే.. కేటీఆర్ ఇప్పటికి 20 సార్లు ఢిల్లీ వెళ్లిండు అని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ సిగ్గు శరం ఉండే మాట్లాడుతున్నావా..? రాష్ట్రంకి కావాల్సిన అవసరాల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంటే.. కేటీఆర్…
ఒక్క నిమిషం కూడా పవర్ పోకుండా చూస్తున్నామని, రైతులకి సోలార్ సిస్టం కూడా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర అభివృద్ధి లో కరెంట్ పాత్ర చాలా ముఖ్యమైనదని, విద్యుత్ సిబ్బంది అధికారుల పాత్ర చాలా ప్రాధాన్యత వుంటుందన్నారు భట్టి విక్రమార్క. వ్యవసాయ పంపు సెట్ల ను నెలరోజుల్లోనే ఇస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. విద్యుత్ సిబ్బంది అధికారులు పొలం బాట పట్టాలని, ఇక్కడ విద్యుత్ సమస్య రాకుండా చూడాలని ఆయన…
రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ బిజీబిజీగా ఉన్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేయడానికి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. కుల గణన పై షెడ్యూల్ ఖరారు చేయడానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సెక్రటేరియట్ లోని వారి ఛాంబర్ లో కీలక సమావేశం జరిగింది. సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తో పాటు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి,బీసీ కమిషన్ సభ్యులు , సభ్యులు వివిధ శాఖల…
స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక కోసం ప్రజల భాగస్వామ్యం కోసం అభిప్రాయ సేకరణ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. యాభై వేల ప్రజల నుంచి విభిన్న ఆలోచనలతో అభిప్రాయ సేకరణ జరిగిందని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కమర్షియల్ క్రాప్స్ పండించే రైతన్నకు భరోసాగా ఈ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆ నియోజకవర్గం కేరాఫ్గా మారింది! దగ్గరుండి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తగినశాస్తే జరిగిందని ఒక బ్యాచ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది! వలస వచ్చిన వారికే ప్రియారిటీ ఇస్తున్నారని.. పాత వాళ్లను పాతరేశారని భగ్గున మండుతున్నారు. ఇంతకూ కొత్త, పాత నేతలుగా వారంతా ఎందుకు విడిపోయారు? సీనియర్లను పక్కన పడేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు?
గుంటూరు కలెక్టరేట్లో కౌలు రైతుల చట్టంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల చట్టంపై ఐదు జిల్లాల వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.
తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ.11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయని సీఎం తెలిపారు.
టీమిండియా మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే.. అది ఒకే రోజు, ఒకే సమయంలో టీమిండియా మ్యాచ్లు ఫ్యాన్స్ కు పండగే పండగ.. ఒకవైపు పురుషుల జట్టు.. మరోవైపు మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలో జరగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా దుబాయ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్…