జనగామ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీరప్ప గడ్డలో కెమిడి లక్ష్మయ్యకు చెందిన 30 మేకలను గుట్టుచప్పుడు కాకుండా కొట్టం నుండి అర్థరాత్రి గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. పండగ సమయంలో జిల్లాలో మేకల దొంగతనం కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై బాధితుడు లక్ష్మయ్య పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసి సంఘాలు భేటీ అయ్యాయి. జూబ్లీహిల్స్ లోని సీఎం అధికారిక నివాసంలో బుధవారం భేటీ అయిన పలు సంఘాల ప్రతినిధులు..తమ ప్రాంత సమస్యలను సీఎం కి వివరించారు
రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. వారంలోపు మిగిలిన వారందరికీ రైతు రుణమాఫీ పూర్తి అవుతుందని వెల్లడించారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం అర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.
మైక్రో ఫైనాన్స్ అధికారులు మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఫైనాన్స్ చెల్లించాలని 8 గంటలుగా ఫైనాన్స్ సిబ్బంది మహిళ ఇంట్లో కూర్చున్నారు. మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి.
కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని.. దసరా సందర్భంగా ప్రతిపక్షాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నామన్నారు.
ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి వెళ్లిన మెసేజ్.. తనకు వివాహమై భర్త పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయేలా చేసింది. ఏకంగా లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చేలా రప్పించింది. భార్య కనిపించకపోవడంతో భర్తకు అనుమానం మొదలై విచారించగా.. ట్విస్ట్లు బయటపడ్డాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. బాసర సరస్వతి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు అందాయి. ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ, అలాగే ఆఫ్లైన్లోనూ లైసెన్సుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు.
జీవితాంతం తోడునీడలా కలిసి జీవిస్తామని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. జీవిత ప్రయాణంలో ఎన్ని కష్టాలెదురొచ్చినా చివరి వరకు కలిసి ఉంటామని పెళ్లితో ముందడుగు వేస్తారు. ఈ జీవిత ప్రయాణంలో తన తోడును కోల్పోతే ఆ బాధ వర్ణణాతీతం. కేవలం దానిని అనుభవించేవారికే దాని విలువ తెలుస్తుంది. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాదు.
వైద్యుడిని భయపెట్టి రూ.2 కోట్లను దోచుకున్న సైబర్ నేరగాళ్లు సైబర్ నేరగాళ్ల వలలో ఎక్కువగా చదువుకున్నవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారే పడుతున్నారు. కష్టపడి కొందరు, వడ్డీలకు డబ్బులిచ్చి మరికొందరు..రోజంతా ఆఫీసులో కూర్చొని.. ఇలా అందరూ ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పక్కనోళ్ల సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నవారే ఎక్కువ.. ఇళ్ల మీద పడి డబ్బులు, నగలు దోచుకెళ్లడం ఓల్డ స్టైల్ అయిపోయింది. దర్జాగా సిస్టమ్ ముందు కూర్చుని లూటీ…