మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు వైభంగా జరుగుతున్నాయి. పూల వేడుకలో ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతులు, చిన్నారుల ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ప్రపంచమంతా పూలతో దేవుడిని పూజిస్తే.. ఆ పూలనే దేవుడిగా పూజించే బతుకమ్మ పండగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. ఈనెల 2న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు.. చివరి రోజు (నేడు)సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. మేఘాలు నల్లగా కమ్ముకున్నాయి. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు.. హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పరువు నష్టం కేసు వేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిగిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి.. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.' విద్యార్థుల ముందు, గురువుల ముందు కేసీఆర్ గారిని విమర్శించడమే మీ విధానమా ముఖ్యమంత్రి గారు @TelanganaCMO. గడిచిన పది నెలలలో కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా ఒక్క సభలో అయినా మాట్లాడారా..?. మాట్లాడేటప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమా లేక పార్టీ కార్యక్రమా అని ముఖ్యమంత్రి గారు మర్చిపోతున్నారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్) కింద కీలకమైన మూడు బ్యారేజీలలో కనీసం రెండింటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది . రెండు సీజన్లుగా గోదావరి నీటిని కోల్పోయిన రైతులు, తమ ప్రజాప్రతినిధులతో కలిసి, KLIS కింద ఆయకట్టుకు ఏకైక ఆధారమైన గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది నుండి సంభావ్య ప్రవాహాలను ఉపయోగించుకోవడానికి పంపింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని ఒత్తిడి చేస్తున్నారు. , కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గవలసి వచ్చింది, అయితే…
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో గెలుపొందింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది.
తెలంగాణలో వరదలకు జరిగిన పంట నష్టానికి పరిహారం నిధులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6 వరకు కురిసిన భారీ వర్షాల వలన జరిగిన పంట నష్టానికి పరిహారం నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. 79,216 మంది రైతులకు చెందిన 79,574 ఎకరాల పంట నష్టానికి 79.57 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. రైతుల అకౌంట్లకే నేరుగా జమా చేసేటట్టు ఏర్పాట్లు ప్రభుత్వం చేయనుంది. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్…
హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి, బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఈ ఓటమిపై కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇండియా కూటమి పార్టీలు హస్తం పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అహంకారం, అతివిశ్వాసమే కాంగ్రెస్‌ని దెబ్బతీసిందని ఉద్దవ్ ఠాక్రే శివసేన ఆరోపించింది. టీఎంసీ…
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.