ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఈరోజు భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్ వేదికగా కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
డిజాస్టర్ మేనేజ్మెంట్పై హైడ్రా కమిషనర్ సమీక్ష నిర్వహించారు. నగరంలో వరదలు, కారణాలు, ఉపశమన చర్యలు (డిజాస్టర్ మేనేజ్మెంట్)పై బుధవారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్ష చేశారు. బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కేంద్రం మాజీ డైరెక్టర్ డా. జీఎస్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. బెంగళూరుతో పాటు.. దేశంలోని ఇతర పట్టణాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమన్వయంతో మెరుగైన వ్యవస్థను రూపొందించడంపై కసరత్తు…
రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో వివిధ కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్స్ అందచేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మిమ్మల్ని చూస్తోంటే దసరా పండగ మూడు…
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ నియామకాల గురించి పట్టించుకోలేదని, ఉపాధ్యాయ నియామకాల పై కనీసం ఆలోచన చేయలేదన్నారు. దశాబ్ద కాలం డీఎస్సీ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పేదలకు విద్యా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ఎన్ని ఇబ్బందులు వచ్చిన…
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది, ఇది రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ అమలును సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన విధానం. ముఖ్యంగా, ఎస్సీ వర్గీకరణపై సమగ్ర నివేదిక అందించేందుకు ఒక వ్యక్తితో కూడిన కమిషన్ను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఈ నివేదిక…
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కౌన్సిల్ (TGERC) ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ టారిఫ్ను డే టైమ్ (ToD) టారిఫ్ సిస్టమ్ ప్రకారం నిర్ణయించినట్లు నివేదించబడింది. ToD టారిఫ్ విధానంలో, విద్యుత్ ఛార్జీలు రోజు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్ రేట్ విధానాన్ని భర్తీ చేయనున్నారు. పగటిపూట, సుంకం 20 శాతం వరకు తగ్గవచ్చు, ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీనికి విరుద్ధంగా, రాత్రి సమయంలో, సుంకం అదే మొత్తంలో పెరుగుతుంది. కొత్త…
ఎంఐఎంకి ఫిరోజ్ ఖాన్ అంటే భయం .. అందుకే దాడులు చేస్తుందంటూ నాంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం జరుగుతుంటే దాంట్లో ఓ వ్యక్తి పడి తల పగిలిందని, అతన్ని పరామర్శించడం కోసం వెళ్ళానన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే తన గుండాలతో వచ్చి దాడి చేశారని ఆయన ఆరోపించారు. లంగపని..దొంగ పని నేను చేయనని ఆయన అన్నారు. విచిత్రం ఏంటంటే.. పోలీసులు ఎంఐఎం వాళ్లపై పెట్టిన కేసులే మా…
మంగళగిరి నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించామని తెలిపారు. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలి.. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి.. ఆ ఉద్దేశంతోనే ఈసమావేశం ఏర్పాటు చేశాం, పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నామని అన్నారు.
వైసీపీ తీరుపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటే తప్పా..? అని ప్రశ్నించారు. బార్లు.. మద్యం వ్యాపారాలను గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు లాక్కొన్నారు.. మద్యం టెండర్లు వేయొద్దని తానెవర్నీ బలవంతం చేయలేదు..? అని చెప్పారు. నెల్లూరులో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు.. మద్యం టెండర్లు వేసుకోవచ్చని అన్నారు.