రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేసి.. శిలా ఫలకం ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దసరా నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని.. మంచి పంటలు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రోజునే మేము వాగ్దానం చేసినం.. రాష్ట్రాన్ని విద్యాపరంగా వైద్య పరంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకు వస్తామని హామీ ఇచ్చిన అని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ అప్పట్లో ఐదు వేల పాఠశాలలను మూసివేసి.. అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసిందని, అందుకే ప్రతి పేదవారికి నాణ్యమైన విద్యను అందించాలని అనుకున్నామన్నారు. గతంలో పెట్టిన గురుకులాల్లో మౌళిక సదుపాయాలు ఉన్నాయా.. అది చూసారా.. వసతులు కల్పించలేదని, ఏ రోజూ కేసీఆర్ ప్రయత్నం చేయలేదు. కానీ ఆయన అనుచరులు ఈ విషయాన్ని తప్పు పడుతున్నారన్నారు. RS ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం.. మీరు ఎక్కడ ఉంటారో మీ ఇష్టం. కానీ మీరు కూడా పేదలకు విద్య అవసరం లేదని అనుకుంటున్నారా. అప్పట్లో గొర్రెలు బర్రెలు అన్నాడు కానీ.. చదువు కో మని చెప్పాడా అని ఆయన అన్నారు.
Russia-Iran: రష్యా- ఇరాన్ అధ్యక్షుల భేటీ..! ఉత్కంఠ రేపుతున్న సమావేశం!
బీసీ, ఎస్సీ, ఎస్టీ లు.. కేవలం కుల వృత్తులకే పరిమితం కావాలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పిల్లలకు చదువు చెప్పడం.. పేదలకు వైద్యం అందించడం మా విధానమని, మీ విధానం.. మీకు సీఎం, మీ కొడుకు మంత్రి.. ఒకరు మంత్రినీ మరొకరిని ఎంపీ చేయటం అని ఆయన వ్యాఖ్యానించారు. ఒడగొట్టినా బుద్ధి మారలేదని, అందుకే విద్యా పరంగా పేదలకు అవకాశము కల్పించి.. దేశంలో ఉన్నత స్థానంలో ఉంచాలని రెసిడెన్షియల్ పాఠశాలలు పెడుతున్నామన్నారు. పార్టీ కార్యాలయాలకు భూమి ఉంటది కానీ.. బడులు కట్టడానికి భూమి.. నిధుల ఉండవన్నారు. అందుకు భిన్నంగా మేము చేస్తున్నామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ లను విడివిడిగా పెడితే.. వారిలో విషం పెరగవచ్చు, కనుక అందరినీ ఓకే దగ్గర చదివిస్తే సోదర భావం పెరుగుతుందని నేను ఇలాంటి పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
Maharashtra: ‘‘మహాయుతి’’లో లుకలుకలు.. కేబినెట్ నిర్ణయాలపై అజిత్ పవార్ అసంతృప్తి..