నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఇటీవల 8 ఔషధాల ధరలను 50 శాతం పెంచడానికి ఆమోదించింది. ఈ ఎనిమిది నిత్యావసర ఔషధాల ధరల పెంపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఔషధాల ధరల నిర్ణయంపై పునరాలోచించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. పౌరుల సంక్షేమమే ప్రధానమని లేఖలో మమత ఉద్ఘాటించారు.
రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు న్యాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్మాదులు, నేరస్థులు పేట్రేగిపోతున్నారన్నారు. గుంటూరులో నవీన్ అనే వ్యక్తి అమ్మాయిపై దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు.
నుడా చైర్మన్ అభినందన సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయం సువర్ణ మయం కాబోతుందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఇంట్లో నియామకాలు చేసుకున్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులకు ఏం చేశారని కేంద్ర మంత్రులు రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరగనివ్వమని, ఉనికి కోసం బి.అర్.ఎస్. గ్రూప్ _1 అభ్యర్థులను రెచ్చగొట్టిందన్నారు…
రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ D మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీ సాధించి జట్టు స్కోరును పెంచాడు.
రికార్డు ధరకు రాజా సాబ్ ఆడియో రైట్స్.. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ ఉండేలా ప్లానింగ్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. వాటిలో ఒకటి మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లో హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రం రానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సెటైర్లు విసిరారు. తనకు నమస్కారం పెట్టేందుకు ఇష్టం లేకనే జగన్ అసెంబ్లీలోకి రావడం లేదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా 18,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. వివిధ మార్గాల్లో ప్రజలపై విద్యుత్ భారం మోపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గృహ అవసరాలకు నెలకు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జ్ ఐదు రెట్లు పెంచాలని భావిస్తోందని, పది రూపాయలు ఉన్న ఛార్జీని 50 రూపాయలు చేయాలని భావిస్తోందన్నారు. ఇళ్ళల్లో…
కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తున్న హౌసింగ్ పథకంలో డూప్లికేట్ లబ్ధిదారులు లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి తాజాగా రూపొందించిన ఆవాస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌పై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. గుంటూరులో ఐదు రాష్ట్రాలలోని అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మనిషిగా పుట్టినవారు చావక తప్పదు.. చనిపోయిన తర్వాత మృదదేహాన్ని కాల్చేసి.. ఆ బూడిదను పవిత్ర జలాల్లో కలుపుతారు. ఈ సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది.. కానీ, మనిషి చితాభస్మంతో కోట్లలో సంపాదిస్తున్నారంటే నమ్ముతారా..? అవును మీరు వింటున్నది నిజమే జపాన్ ప్రభుత్వం మనిషి బూడిదతో వందల కోట్లలో సంపాదిస్తుంది.
నిజామాబాద్ జిల్లాలో నుడా చైర్మన్ కేశ వేణు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ వన్ పరీక్షల విషయంలో బీఆర్ఎస్ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టను మాసకబార్చే ప్రయత్నం చేసారు.. కానీ పరీక్షలకు అనుమతి లభించిందన్నారు మంత్రి జూపల్లి. సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయమని, కాంగ్రెస్…