డ్రోన్ రంగంలో దిశా నిర్దేశం చేసేలా సదస్సు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి అని డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్ సమ్మిట్‌లో యువత, విద్యార్థులు ఎక్కువ మంది భాగస్వామ్యం వహించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
బంగాళాఖాతంలో తుఫాన్ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. బంగాళాఖాతంలో బలపడే తుపాను సంసిద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ కాన్ఫరెన్స్ నిర్వహించింది.
హోంమంత్రిపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్.. రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు న్యాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్మాదులు, నేరస్థులు పేట్రేగిపోతున్నారన్నారు. గుంటూరులో నవీన్ అనే వ్యక్తి అమ్మాయిపై దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. హోం మంత్రి , డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను కక్ష్య సాధింపుకు వాడుతున్నారని,…
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. పలు ముఖ్యమైన అంశాలపై విజ్ఞప్తి చేశారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ క్యాంపస్‌లు వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటయ్యాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థను నెలకొల్పాలని కోరారు.
ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ హిమాన్షు పాఠక్‌ను నియమిస్తున్నట్లు ఆ సంస్థ పాలక మండలి అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని ICRISAT ప్రధాన కార్యాలయంలో అక్టోబర్ 18న జరిగిన ఆల్ స్టాఫ్ కార్యక్రమంలో పాలక మండలి చైర్ ప్రొఫెసర్ ప్రభు పింగళి ఈ విషయాన్ని ప్రకటించారు. డాక్టర్ పాఠక్ ప్రపంచ వ్యవసాయ పరిశోధన , అభివృద్ధిని అభివృద్ధి చేయడంలో విశిష్టమైన వృత్తిని కలిగి ఉన్నారు , ICRISATకి అనుభవ…
రేపు, ఎల్లుండి డ్రోన్ సమ్మిట్ సీకే కన్వెన్షన్‌లో జరుగుతోందని ఏపీ ప్రభుత్వ సెక్రటరీ సురేష్ పేర్కొన్నారు. నాలుగు కేటగిరీలలో రిజిస్ట్రేషన్ ఆన్ లైన్లో చేశామన్నారు. డెలిగేట్స్, డ్రోన్, హ్యాకథాన్, స్పీకర్స్ కేటగరీల కింద రిజిస్ట్రేషన్లు చేశామని చెప్పారు. 6929 రిజిస్ట్రేషనులు వచ్చాయని.. రెండు రోజుల క్రింద రిజిస్ట్రేషన్లు ఆపేశామన్నారు.
అమృత్ మెడికల్ సైన్స్ కళాశాలలో ఒకేషనల్ పారామెడికల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు తమ సంస్థ రిజిస్ట్రేషన్ స్టేటస్‌పై ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చదువు పూర్తయినా తమకు కోర్సు సర్టిఫికెట్లు అందలేదని విద్యార్థులు కళాశాల రిజిస్ట్రేషన్ చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థుల ప్రకారం, సర్టిఫికేట్ల కోసం వారు పదేపదే చేసిన అభ్యర్థనలకు సమాధానం లభించలేదు, ఇది నిరాశకు దారితీసింది , వారి భవిష్యత్తు అవకాశాల గురించి అనిశ్చితికి దారితీసింది. కాలేజీ యాజమాన్యం…
ఏపీలో మరో సంక్షేమ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుకను అందించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
ఈ నెల 23, 24వ తేదీల్లో మూసీ పరీవాహక ప్రాంతంలో 9 టీమ్ లు పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. 18 ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల బృందాలు పర్యటిస్తాయని ఆయన తెలిపారు. అక్కడ ప్రజలకి భరోసా కల్పిస్తాయని, ఈ నెల 25న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హై కమాండ్‌కు కప్పం కట్టేందుకు ప్రతినెలా ఎత్తులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి అని…
ఉచిత ఇసుకపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుకను ఉచితంగా అందించడమే లక్ష్యంగా సీనరేజీ రద్దు చేశామన్నారు. సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చామన్నారు.