మురికి కాలువలో రూ.500 నోట్లు కొట్టుకొచ్చిన ఘటన మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని ఆట్పాడిలో చోటుచేసుకుంది. మురికి కాలువలోని మురికి నీళ్లలో రూ.500 నోట్లు కనిపించడంతో జనాలు తొలుత వాటిని నకిలీ నోట్లుగా భావించారు. కానీ అవి నిజమైన నోట్లే అని తెలిశాక జనం ఆ నోట్ల కోసం ఎగబడ్డారు. కాలువలోని మొత్తం చెత్తను తొలగించి మరీ రూ.500 నోట్ల కోసం వెతికారు.
వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే.. ఈ పర్యటనలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ టూర్లో పాల్గొంటాడా లేదా అనేది అనుమానాలు ఉండేవి. అయితే.. వాటికి షమీ ఫుల్ స్టాప్ పెట్టాడు. తన ఫిట్నెస్పై షమీ స్వయంగా అప్డేట్ ఇచ్చాడు. తాను నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందానని, ఆస్ట్రేలియా టెస్టు పర్యటనకు దూరం కానని చెప్పాడు.
దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాది కపిల్ సిబల్ సహా సీనియర్ న్యాయవాదులను మేము ఈ కేసు కోసం నియమించామని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టే పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ హైకోర్టు తుది తీర్పులకు లోబడి ఉంటుందని కోర్ట్ స్పష్టం చేసిందన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్నారు కాబట్టి వాటిని వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు భావించిందన్నారు. పరీక్షలు నిర్వహిస్తే నిర్వహించారు, ఫలితాలను…
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పునఃప్రారంభించారు. 2014-19లో భావనపాడు పోర్టు కోసం టెండర్లు సైతం పిలిచామని.. ప్రభుత్వం మారడంతో మూలపేటకు పోర్టును మార్చారని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం అనేది కంటిన్యూ కార్యక్రమం అని ఆయన తెలిపారు. అలా అమలు చేయకపోతే ఎంతో నష్టం ఉంటుందన్నారు.
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసి)పై పెట్రోలింగ్కు సంబంధించి భారతదేశం-చైనా మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. గత కొన్ని వారాలుగా దౌత్య, సైనిక స్థాయిలో భారతదేశం-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని.. తాము చైనాతో సమస్యలపై ఒక ఒప్పందానికి వచ్చామని చెప్పారు.
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య జరిగింది. టైటిల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 32 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేతగా న్యూజిలాండ్ అవతరించింది.
ఫార్మా కంపెనీ కడితే కట్టు… లేకపోతే కాంగ్రెస్ పార్టీ రైతులకు తిరిగి భూములను ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరు ప్రమిద కన్వెన్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దసరా సమ్మేళనం కార్యక్రమంలో కేటీఆర్, జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,ఎమ్మెల్యే సబితా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రవేశ పెట్టిన రిజర్వేషన్లు అమలు చేయండని అన్నారు. కార్యకర్తలను…
గ్రూపు-1 పరీక్షల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి మంచిది కాదని. తక్షణమే పరీక్షలు వాయిదా వేయాలని. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్-1 వాయిదాపై. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో… బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. గ్రూపు-1 పరీక్షలలో బీసీ, ఎస్సి, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని… రిజర్వేషన్ల అమలులో అక్రమాలు జరిగాయని ఆర్. కృష్ణయ్య…
ఏఐ సాంకేతికతతో 60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన లోకో పైలట్.. వీడియో వైరల్ అస్సాంలో ఓ లోకో పైలట్ తన తెలివి తేటలతో పెను ప్రమాదాన్ని కాపాడారు. వాస్తవానికి.. రైలు నంబర్ 15959 కమ్రూప్ ఎక్స్ప్రెస్ గౌహతి నుంచి లుమ్డింగ్కు వెళ్తోంది. రాత్రి 8:30 గంటల సమయంలో.. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ అకస్మాత్తుగా 60 కంటే ఎక్కువ ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ గుండా వెళుతున్నట్లు చూశారు. ఏనుగుల గుంపును చూసిన లోకో పైలట్…