ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై ఓటర్ల చైతన్యం, అవగాహన ప్రచారంలో ఉత్తమంగా కృషి చేసిన మీడియా సంస్థలకు-2024 పేరిట భారత ఎన్నికల సంఘం మీడియా అవార్డులను ప్రదానం చేసేందుకు వివిధ మీడియా సంస్థల నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
నగర పరిధిలోని చెరువల ఆక్రమణలను తొలగించిన హైడ్రా ఇప్పుడు.. ఆయా చెరువుల పునరుజ్జీవనంపై దృష్టి సారించింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతీనగర్‌కు చేరువలో ఉన్న ఎర్రకుంట చెరువుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు.
రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టలరీల్లో సీఐడీ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో వివిధ డిస్టలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యం లెక్కలపై సీఐడీ బృందాలు ఆరా తీస్తోంది. డిస్టలరీల నుంచి నేరుగా నేతలకు మద్యం సరఫరా చేశారనే కోణంలో పరిశీలిస్తున్నారు. డిస్టలరీల యాజమాన్యం వెనుక బినామీలు ఉన్నారానే కోణంలో విచారణ జరుగుతోంది.
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై గవర్నర్, డీజీపీలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు.
ఢిల్లీలో రెండో రోజు ఏపీ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమయ్యారు.
రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ మెరుపు దాడులు చేసింది. ఆదానికి మించిన ఆస్తుల కేసులో భూపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. భూపాల్ రెడ్డికి సంబంధించిన ఐదు చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. ఈ క్రమంలో.. 40 కోట్ల రూపాయల వరకు అక్రమాసులను గుర్తించింది ఏసీబీ..
కూటమి ప్రభుత్వం పాలన మహిళలకు చీకటి కాలమని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్రంగా మండిపడ్డారు. దీనికి కారణం ఎవరు.. నేరస్థులకు ఇంత ధైర్యం ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏమి చేయటం లేదని ఆమె ఆరోపించారు. చంద్రబాబు కూటమి బలాన్ని ఎందుకు వాడుకుంటున్నారు.. అధికారులపై ఒత్తిడి తేవడం కోసం వాడుకుంటున్నారని శ్యామల అన్నారు.
స్పీకర్ ఛాంబర్, మండలి భవనం మరమ్మత్తులపై మంత్రులు సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్‌లు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్, రహదారులు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన పనులపై స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు రివ్యూ చేశారు.
ఢిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్ ఆవరణలో MDOలతో జరిగిన వర్క్‌షాప్ లో పాల్గొని .MDOలకు స్టార్ రేటింగ్స్ అందజేశారు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి గారి ఆదేశాల ఆధారంగా మేం లక్ష్యాలు నిర్దేశిస్తామని, మీరు వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తారన్నారు. ఇది మొదటి ప్రయత్నం.. రానున్న రోజుల్లో రెండ్రోజులపాటు ఇలాంటి సమన్వయ సమావేశాలు నిర్వహించుకుందామని, మీరు లేవనెత్తుతున్న సమస్యలు.. అందరు ఎదుర్కొంటున్న సమస్యలు.. రానున్న రోజుల్లో..…
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్‌తో 2024 మహిళల టీ20 ప్రపంచ కప్ 'టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్'లో చోటు దక్కించుకుంది. ఈ 'టీమ్ ఆఫ్ టోర్నీ'లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలి మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీ 20 వరల్డ్ కప్‌లో భారత్.. సెమీ-ఫైనల్‌కు చేరుకోపోయినప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం అద్భుత ప్రదర్శన చేసింది.