Love Story: మనసుకు ఎత్తు, అందంతో పనిలేదు మనల్ని అర్థం చేసుకునే మనస్సు ఉంటే చాలు. ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగిఉంటే చాలు. వారిద్దరి ప్రేమ,పెళ్లి చరిత్రలో నిలిచిపోంతుంది అనడానికి ఇప్పుడు చెప్పే కథే ప్రేమికులకు ఆదర్శం. ప్రేమకు జీవించడానికి అందంకాదు మనసుని అర్థం చేసుకుని, బతికినంతకాలం మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్లు ఉంటే జీవితాంతం బతికేయొచ్చనేదే ఈ నిజమైన కథ. మనకు ఎవరి పట్ల ప్రేమతో కూడిన భావాలు హృదయంలోకి వస్తాయో.. ఆ వ్యక్తి చూడటానికి ఎలా ఉన్నా అతన్ని అంగీకరిస్తాం. ఈ స్టోరీలో మనం చర్చించబోయే జంటలలో ఒకరికి అదే జరిగింది.ఈ కపుల్స్ ను ఎవరు మొదటిసారి చూసినా ఈ ఇద్దరు భార్యాభర్తలని నమ్మలేరు. ఎందుకంటే భర్త ఎత్తు చాలా తక్కువ.. భార్య ఎత్తు చాలా ఎక్కువ!! అయితే ఈ జంటది ప్రేమ వివాహం కావడం విశేషం.
Read also: BRS party: బీఆర్ఎస్ పార్టీ పేరు నాకే కేటాయించాలి.. న్యాయపోరాటం తప్పదు..!
జేమ్స్ లస్టెడ్, క్లో సమంతా లస్టెడ్ 2016లో వివాహం చేసుకున్నారు. వారిద్దరూ UKలోని నార్త్ వేల్స్‌లో నివసిస్తున్నారు. ఇద్దరిదీ ఒకే ఊరు. జేమ్స్ వయసు 33 ఏళ్లు. అతను నటుడు, టీవీ వ్యాఖ్యాత. అతని భార్య క్లో టీచర్. ఆమె వయస్సు 29 సంవత్సరాలు. వారిద్దరూ జూన్ 2, 2021న కొత్త రికార్డును నెలకొల్పారు. ఎత్తులో భారీ వ్యత్యాసంతో జంటగా రికార్డు సృష్టించారు.జేమ్స్ ఎత్తు 109.3 సెం.మీ (3 అడుగుల 7 అంగుళాలు), అతని భార్య క్లో ఎత్తు 166.1 సెం.మీ (5 అడుగుల 5.4 అంగుళాలు). రెండింటి మధ్య వ్యత్యాసం 56.8 సెం.మీ. అంటే ఈ రెండింటి ఎత్తులో దాదాపు 2 అడుగుల (1 అడుగు, 10 అంగుళాలు) తేడా ఉంటుంది. డయాస్ట్రోఫిక్ డైస్ప్లాసియా, జన్యుపరమైన రుగ్మత యొక్క అరుదైన రూపాలలో ఒకటి. దీంతో జేమ్స్ శరీరంలో ఎముకలు, నాడీ వ్యవస్థ ఎదుగుదల ఆగిపోయింది. జేమ్స్ తన మరుగుజ్జుత్వం కారణంగా ఎప్పటికీ పెళ్లి చేసుకోనని అనుకున్నాడు.
అయితే 2012లో జేమ్స్ తన ప్రేయసి క్లోను కలుసుకుని మనసు మార్చుకున్నాడు. ఆమె ప్రేమలో పడిన అతను తను కూడా తనని ఇష్టపడుతుందని గ్రహించాడు. ఇద్దరూ స్థానిక క్లబ్‌లో కలుసుకున్నారు. ఆ సమయంలో ఇంకా చదువుకుంటోంది క్లో. ఇద్దరం ఏడు నెలలు డేటింగ్ చేశారు. చివరగా.. 2013 చివరలో జేమ్స్ నన్ను సరస్సు వద్దకు తీసుకువెళ్ళాడని క్లో చెప్పుకొచ్చింది. అతను మోకాళ్లపై కూర్చొని నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ ఫీలింగ్ నాకు చాలా బాగా అనిపించింది. నేను ఆ ప్రతిపాదనను అంగీకరించి పెళ్లి చేసుకున్నాను. ఈ రోజు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. ఇద్దరు మనషులు ఒకటయ్యాయి. పెళ్లితో ఇద్దరు ఒకటయ్యాము. ఇప్పుడు మా ఇద్దరి ప్రేమకు గుర్తు ఒకపాపకూడా ఉందని వారి సంతోషాన్ని పంచుకున్నారు.
Manchu lakshmi: మోహన్ లాల్ తో ఏడాదికో సినిమా చేయాలని ఉంది