Floods in Pakistan: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరద బీభత్సం కారణంగా లక్షలాది మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి రూపొందించిన నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం ప్రారంభంలో దేశంలోని మూడవ ప్రాంతాన్ని భారీ వరద ముంచెత్తింది. తరువాత పాకిస్తాన్‌లోని అనేక జిల్లాల్లో నివసిస్తున్న సుమారు ఎనిమిది మిలియన్ల మంది ప్రజలు ఇప్పటికీ వరద నీటిలో చిక్కుకుపోవచ్చని పేర్కొంది. దక్షిణ సింధ్ ప్రాంతంలో దాదాపు 2.4లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొంది.
Read Also : Amaravati : చిట్ ఫండ్ కేసులపై ఓ కన్నేయండి
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో ఇప్పటికీ 80 లక్షల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నట్లు అంచనా. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేకపోవడంతో పిల్లలకు డయేరియా, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇళ్లకు తిరిగి వస్తున్న వారికి ఆహారం, నీరు, మందులు వంటి నిత్యావసరాల కొరత ఎదురవుతౌంది. ఈ విపత్తులో 1700 మంది మరణించారు, అనేక రోడ్లు, వంతెనలు, భవనాలు కొట్టుకుపోవడంతో దేశం మొత్తం ఇప్పటివరకు దాదాపు రూ.2.5 లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వచ్చిన తర్వాత కూడా, ఆహారం, నీరు, ఔషధాలు వంటి ప్రాథమిక వస్తువుల కొరతను ఎదుర్కొంటున్నారని UN నివేదిక చెబుతోంది.
Read Also: WeDontWantTheriRemake: నా చావుకు హరీష్ శంకరే కారణం.. పవన్ లేడీ ఫ్యాన్ సూసైడ్ నోట్
సింధ్‌లోని 11 జిల్లాలు, బలూచిస్థాన్‌లోని 2 జిల్లాల్లో వరద నీరు ఇప్పటికీ అలాగే ఉండటంతో పరిస్థితులు అధ్వానంగా మారాయి. సింధ్‌లోని దాదు, కంబర్-షహదాద్‌కోట్, ఖైర్‌పూర్, మిర్‌పుర్‌ఖాస్, జంషోరో, సంఘర్, ఉమర్‌కోట్, బాడిన్, షహీద్ బెనజీరాబాద్, నౌషహ్రో ఫిరోజ్‌తోపాటు బలూచిస్తాన్‌లోని సోహబత్‌పూర్, జఫరాబాద్ జిల్లాల్లో ప్రజలు ఇప్పటికీ వరద నీటి ముంపునకి గురయ్యారు. దక్షిణ సింధ్‌లో దాదాపు 2.5 లక్షల మంది స్వదేశానికి తిరిగి రాలేకపోయినట్లు తెలుస్తున్నది.
Read Also : Air Pollution : ముంబైలో పడిపోయిన గాలినాణ్యత.. ఢిల్లీని పక్కకు నెట్టి మరీ
సెప్టెంబర్ నుంచి మలేరియా కేసులు బలూచిస్తాన్‌లో 25 శాతం, ఖైబర్-పఖ్తూన్‌లో 58 శాతం, సింధ్‌లో 67 శాతం తగ్గాయి. అయినప్పటికీ ప్రజలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దాదాపు 10 లక్షల మంది ప్రజలు ఇప్పటికీ ఆహార కొరత సమస్యతో పోరాడుతున్నారు. వచ్చే జనవరి-మార్చి మధ్య అత్యవసర ఆహార సంక్షోభం కనిపిస్తుందని నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.