CM KCR : ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని రేపు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అయితే.. నిన్న సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయ పనులను పరిశీలించారు. యాగం, పూజలు జరుగుతున్న ప్రదేశాలను సందర్శించిన కేసీఆర్.. అక్కడి వారికి పలు సూచనలు చేశారు. రేపు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని మధ్యాహ్నం.12.37 నుంచి 12.47 మధ్య కేసీఆర్ ప్రారంభించనున్నారు. రేపు బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయిని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read : Amara Raja: ఆ ప్రచారానికి ఇలా చెక్.. ఏపీలో అమరరాజా రూ.250 కోట్ల పెట్టుబడి..
బీఆర్‌ఎస్ పెట్టడం కేసీఆర్ సైనికుడిగా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమానికి పంజాబ్, హరియణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు నుంచి రైతు నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అఖిలేష్, కుమారస్వామి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ఆహ్వానించామని పేర్కొన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు రుత్వికులు యాగాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా ఈ ప్రత్యేక పూజాకార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి హస్తిన చేరిన బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు.
Also Read : Anti-rape Footwear: అత్యాచార నిరోధక ఫుట్‌వేర్‌ని రూపొందించిన కర్ణాటక విద్యార్థిని
Also Read
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!