ఆంధ్రప్రదేశ్లో ఐఎఎస్లు బదిలీలు అయ్యారు. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా 2009 బ్యాచ్ ఐఎఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ నియమించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ కమిషనర్గా పని చేశారు. అలాగే.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా 2013 ఐఎఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ షా నియమించారు.
గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు.
కాలేజీ అమ్మాయిల స్కూటీ లు ఎటు పాయే.. సీఎం రేవంత్ ట్వీట్ పై డీకే అరుణ ఫైర్.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై డీకే అరుణ ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు అమలు చేస్తాం అన్నారని గుర్తు చేశారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఒక్క ఇల్లు మొదల పెట్టలేదన్నారు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా..? అని ప్రశ్నించారు. రైతు…
చంద్రబాబు నాయుడుతో ఢీ కొట్టడం అంటే ఎప్పుడు సిద్ధమేనని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. తాను కార్యకర్తల మనిషిని, కార్యకర్తల కోసమే నిలబడతానని అన్నారు. తాను గ్రూపులు కట్టడానికి రాలేదు.. ఒక నేతగా కాదు.. కార్యకర్తలకు అండగా నిలుస్తానన్నారు. నియోజకవర్గంలో ఇంఛార్జికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటే, తగలపెడుతుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటే ఎందుకు చంద్రబాబు, హోంమంత్రి అనితా కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. వీటిపై పవన్ కల్యాణ్ ఎందుకు నోరు తెరవడం లేదని అడిగారు. చంద్రబాబును ఈ జిల్లా వాడు అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నామన్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుటి నుంచి ఒక మాఫియా పాలనా చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆటవిక రాజ్యం సృష్టిస్తున్నారని... వీరి అరాచకాలపై ఢిల్లీలో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఇంటింటికి డబ్బులు, పథకాలు వచ్చేవీ అవన్నీ మాయం అయ్యాయన్నారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తికి గురి కావడంతో ఓటమి పాలయ్యామని అన్నారు. నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
గుంటూరు శ్యామలా నగర్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిది కృష్ణారెడ్డిపై దాడి జరిగింది. ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు కొంతమంది యువకులు కర్రలు రాడ్లతో వాహనాలపై దాడి చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కార్ సీరియస్ అయింది. అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టెక్నాలజీ సాయంతో పటిష్టమైన నిఘా పెట్టాలని ఆదేశించింది. నందిగామ, జగ్గయ్యపేటలో ఇసుక మాఫియా ఆగడాలపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో సీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.