రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారింది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచులు బిచ్చగాళ్ళలాగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధ్యానం కొనుగోళ్ళు వెంటనే చేబట్టాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ ఎంతమందికి అయ్యింది? అని…
ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ భేటీ అయింది. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణపై చర్చించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి కొన్ని అనారోగ్యకరమైన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. ఇవి తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపి రోగాల బారిన పడుతున్నారు. ఇంతకీ.. డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన జాబితాలో అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు తినడం వల్ల వచ్చే రోగాల గురించి తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మృతితో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.
ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను రిటెన్షన్, రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఉన్నదంతా మెగా వేలం ఎప్పుడు జరుతుందనేది. మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఏ ఏ ఆటగాళ్లను తీసుకుంటారు... ఏఏ ఆటగాళ్లు ఏ జట్టుకు వెళ్తారనేది క్రికెట్ అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది.
దాదాపు ఏడాది పాటు టీమిండియాకు దూరమైన మహ్మద్ షమీ ఆటను చూడాలంటే అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. రంజీ ట్రోఫీలో ఆడనున్న షమీ.. తదుపరి రెండు రౌండ్ల మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దేశవాళీ రెడ్ బాల్ టోర్నమెంట్లో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లతో జరిగే తదుపరి రెండు మ్యాచ్‌ల బెంగాల్ జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కలేదు.
ఏపీలో నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణ, నిర్మూలన, అక్రమ మద్యం నివారణ, డ్రగ్స్, మద్యం బాధితుల పునరావాసంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోమ్, మానవ వనరుల, ఎక్సైజ్, గిరిజన సంక్షేమం, వైద్యారోగ్య శాఖ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్రీడలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు , క్రీడల నిర్వహణ, గ్రామ స్థాయిలో క్రీడా స్థలాల ఏర్పాటు పై చర్చించారు.
Telangana TET Notification: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుండి (5 వ తేదీ) దరఖాస్తుల స్వీకరణ జరగనుంది.
గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారు.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు. సొంత జిల్లాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాడో చూస్తుంటే కనిపిస్తుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారు.. ఎలాంటి…