అనుమతి తీసుకుని పోలవరంలో ఎవరైనా పర్యటించవచ్చని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పద్దతి లేకుండా, తోకలేని కోతుల్లా ప్రాజెక్టులోకి వెళ్తామంటే ఉపేక్షించమని మంత్రి హెచ్చరించారు.
Aadhaar Card: భారతదేశ పౌరులకు ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆసుపత్రుల నుంచి బ్యాంకులు, కళాశాలలు, రేషన్ దుకాణాలు ఇలా ప్రతిచోటా ఆధార్ కార్డు తప్పనిసరి.
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాడే తప్ప ఎప్పుడు కూడా సింగిల్గా వచ్చింది లేదన్నారు.
ఖాతాదారులకు మరింతగా చేరువయ్యేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులు, అన్ని రకాల యూజర్ చార్జీలను ఇకపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లోనూ చెల్లించొచ్చు. అన్ని రకాల స్టాంప్ పేపర్లు కూడా ఈ బ్యాంకు శాఖల్లో లభిస్తాయి.
మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు బీజేపీ తలపెట్టిన సభల్లో ఒకటి శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద జరగనుంది. ఇవాళ శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా అధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా బంపర్ డిస్కౌట్ ఆఫర్స్ ప్రకటించింది. వివిధ రకాల మోడళ్లపై గరిష్టంగా రూ.65 వేల వరకు డిస్కౌంట్ కల్పిస్తోంది. మీరు బడ్జెట్ ధరలో మంచి కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు.
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం శివారులో రహదారిపై చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.