సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వజ్రపుతునకగా ఉన్న సింగరేణిని రెండు పార్టీలు నాశనం పట్టించాయని మండిపడ్డారు. వికలాంగుల ఫించను మరో వెయ్యి పెంచుతున్నామని సీఎం కేసీఆర్ మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేదన సభలో ప్రకటించారు.
వేప కాండం నుంచి మొదలు పెడితే వేర్లు, చిగుళ్లు, విత్తనాలు వరకు ఆరోగ్యానికి మేలు చేసేవిగా ఉంటాయి. వేప చేదుగా ఉన్నా.. దానిలో మాత్రం ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. వేప అద్భుతమైన శీతలీకరణ ఏజెంట్. ఇది హైపర్ అసీడిటీ, మూత్ర మార్గ రుగ్మతలు, చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వేప ఆకులతో ఎన్నో ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యల నుంచి బయటపడొచ్చు.
గింజలు, విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొందరు వాటిని తినడానికి దూరంగా ఉంటారు. అలా అయితే మీ శరీరంలో విటమిన్లు, ప్రొటీన్లు తగ్గినట్టే. న్యూట్రీషియన్ పవర్హౌస్గా పిలవబడే గింజలు మరియు విత్తనాలు రుచికరమైనవి, సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిని అన్ని వయసుల వారు తినవచ్చు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ను సీఎం కేసీఆర్ తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.
తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభానికి సమయం దగ్గర పడింది. 2023 జూన్ 12 సోమవారం రోజు నుంచి స్కూళ్లు రీ ఓపెన్ కానున్నాయి. అంటే వేసవి సెలవులకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉందన్నమాట.
రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, రెవెన్యూ, టీ-సెర్, మహిళ, ట్రాన్స్ జెండర్ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని ప్రసంగించారు.