Madhyapradesh: ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఐదు హామీలను ప్రకటించారు. ఆమె జబల్‌పూర్ జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. ఐదు హామీల గురించి మాట్లాడుతూ.. “రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలవారీ రూ.1,500 సహాయం, ప్రతి ఇంటికి రూ.500 చొప్పున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్, 100 యూనిట్ల విద్యుత్ ఉచితం, 200 యూనిట్లు సగం ధరకు అందజేస్తామని ప్రియాంక గాంధీ చెప్పారు. రైతుల రుణాలు మాఫీ చేసి రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. తాము నర్మదా నది ఒడ్డుకు వచ్చి అబద్ధం చెప్పమన్నారు.
బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. వారు ఇక్కడిక ప్రకటనలు చేస్తారు తప్ప వాటిని నెరవేర్చరన్నారు. వారు డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. వారు ఎక్కడైనా అదే చెబుతారన్నారు. డబుల్ ఇంజిన్ గురించి మాట్లాడటం మానేసి పని ప్రారంభించాలని కర్ణాటక ప్రజలు వారికి చూపించారు. “మా పార్టీ ఏ వాగ్దానాలు చేసినా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో వాటిని నెరవేర్చాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పరిస్థితి చూడండి. ప్రజలు ఇది గ్రహిస్తారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చాలా అభివృద్ధి జరిగింది.” అని ఆమె చెప్పారు.
Also Read: Cyclone Biparjoy: ప్రధాని మోడీ హైలెవల్ మీటింగ్.. బిపర్జోయ్ తుఫాన్ను ఎదుర్కొనే దానిపై సమీక్ష
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, బీజేపీ ధనబలంతో ప్రభుత్వాన్ని బద్దలు కొట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మధ్యప్రదేశ్‌లో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి.. దుర్వినియోగాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ చూపిన జాబితా కంటే ఇక్కడ కుంభకోణాల జాబితా చాలా పెద్దది. మహాకాల్ లోక్ కారిడార్ నిర్మాణంలో కూడా కుంభకోణం జరిగింది. రాష్ట్రంలో 220 నెలల పాలనలో బీజేపీ 225 కుంభకోణాలు చేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో భారీ ద్రవ్యోల్బణం ఉంది.. ఎల్‌పీజీ సిలిండర్లు, డీజిల్, పెట్రోల్ ఖరీదుగా మారాయి. గత మూడేళ్లలో కేవలం 21 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం సిగ్గుచేటు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఘోష్ణవీర్ (అనౌన్సర్) 18 ఏళ్ల పాలనలో ఆయన 22,000 ప్రకటనలు చేశారు’’ అని ఆమె ఆరోపించారు. కర్నాటక ఎన్నికల సందర్భంగా ఐదు హామీలు ఇచ్చామని, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ఐదు హామీలను కేబినెట్‌లో ఆమోదించామని ఆమె తెలిపారు.