Business Plans: ఇప్పుడున్న కాలంలో యువత బిజినెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకరి కింద ఉద్యోగం చేయడం ఇష్టం లేక.. సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని చూస్తున్నారు. కష్టమో.. నష్టమో తానే అనుభవిస్తానంటూ బిజినెస్ బాటలోకి అడుగుపెడుతున్నారు. ఐతే బిజినెస్ చేయాలనుకునే వాళ్లు.. అది కూడా నెలకు లక్షల్లో ఆదాయం పొందాలనుకునే వాళ్లు ఎలాంటి వ్యాపారాలు చేస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: Ntr : సుకుమార్ తో మరో సినిమా చేయడానికి సిద్దమైన ఎన్టీఆర్…?
ఫుడ్ బిజినెస్ చేస్తే మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మంచి క్వాలిటీ, రుచి మెయింటైన్ చేస్తే లాభర్జన పొందవచ్చు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసినట్లయితే చక్కటి లాభం పొందవచ్చు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టాలో ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పటి యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్, ఇటాలియన్ ఫాస్ట్ ఫుడ్, నార్త్ ఇండియా వంటకాలు, అలాగే కాంటినెంటల్ రుచులపై నోరుపారేసుకుంటున్నారు. అందుకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే చక్కటి లాభం పొందవచ్చు. ముఖ్యంగా లాభాలు పొందాలంటే అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశాలు చూసి పెట్టుకోవాలి. బస్టాఫ్ లు, ఆఫీసుల దగ్గరైతే మంచి లాభాలు వచ్చే అవకాశాలు వస్తాయి. ముందుగా షాపును మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సెట్ చేసుకోవాలి. కిచెన్, బిల్లింగ్ కౌంటర్, సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం ద్వారా మీరు మంచి వ్యాపారం చేసే వీలు కలుగుతుంది. మీరు చేసే ఫాస్ట్ ఫుడ్ నాణ్యతలోనూ, రుచిలోనూ ఏమాత్రం తగ్గకూడదు అంటే మినిమమ్ రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి కిచెన్ ఏర్పాటు చేసుకుంటే మంచిది.
Read Also: Samantha : సమంత సౌత్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిందా..?
ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు కావాల్సిన వంట సామాన్ల కోసం మీరు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేస్తే మంచిది. వీటికోసం పెట్టుబడి ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు అవుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కూడా పెట్టుకుంటే మీరు ఇంధనం కోసం పరుగులెత్తాల్సిన పని ఉండదు. ఇక మెనూ విషయానికి వచ్చినట్లయితే చైనీస్ నూడుల్స్, వెజ్ నాన్ వెజ్ వంటకాలు, పిజ్జా బర్గర్, ఫ్రైడ్ రైస్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంచినట్లయితే, మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చక్కగా రన్ అవుతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు మొత్తం పెట్టుబడి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టవచ్చు. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో బిజినెస్ చేసినట్లయితే, తక్కువ పెట్టుబడి లోనే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేయవచ్చు అప్పుడు మీకు పెట్టుబడి ఒక లక్ష నుంచి రెండు లక్షలు మాత్రమే అవుతుంది. ఇక ఆదాయం విషయానికి వచ్చినట్లయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మీద కనీసం నెలకు ఒక లక్ష నుంచి 2 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది.