పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నిమిషాల నుంచి 12.30 నిమిషాల వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం.. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TSBSE) పదో తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్ 2023ని ఈ నెల 8వ తేదీన జారీ చేసింది.
Also Read : WTC Final 2023: అరుదైన ఘనత సాధించిన ఐదుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్!
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్ www.bse.telangana.gov.inలో యాక్టివేట్ చేయబడింది. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి తోడు హాల్ టికెట్లు సంబంధిత పాఠశాలలకు పంపించామని తెలిపారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడవన్నారు.
Also Read : Viral News: తాగితే లోకమే మరిచిపోతారా.. తాగిన మత్తులో.. అలా చేశాడు..!
ఇదిలా ఉంటే.. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2. 30 గంటల నుంచి సాయంత్రం 5. 30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి.