నంద కుమార్ మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేయడంతో.. వారు వీధికుక్కలను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో మాజీ మేయర్ నివాసానికి సమీపంలో పట్టుబడ్డ నాలుగు కుక్కలకు మున్సిపల్ అధికారులు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేశారు.
మనం ఎవరి పెళ్లికైనా వెళ్తే.. లగ్గం అవ్వగానే వచ్చి భోజనాల మీద పడుతరు. అక్కడ వడ్డించే వారు మనకు ఒక మటన్ ముక్క తక్కువేస్తే.. మనసులో వీడేంటీ పక్కనోళ్లకే ఎక్కువేసి నాకు తక్కువ వేస్తున్నాడని ఫీలవుతాం. ఎందుకంటే పెళ్లిలో మటన్ కూర ఉంటే లొట్టలేసుకొని తింటారు. ఐతే పెళ్లిలో మటన్ తక్కువైందని పెళ్లే ఆగిపోయింది. ఈఘటన ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఒకటి చోటుచేసుకుంది. సంబల్ పూర్ కు చెందిన యువతి సుందర్గడ్కు చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటున్నది.
కత్తిపూడి బహిరంగ సభలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు రావని సీఎం జగన్ కథలు చెప్తున్నాడని.. నవంబర్, డిసెంబర్లలోనే ఎన్నికలు జరుగుతాయని పవన్ తెలిపారు.
సీఎం మూడు రాజధానులు అని నాటకాలు ఆడుతున్నాడని.. అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు. గాజువాక నుండి తనను గెలిపించి ఉంటే వైజాగ్ దోపిడీ ఆపేవాడినని పవన్ పేర్కొన్నారు. గోదావరి ఈ నేలను విడిచి ఎలా వెళ్లలేదో.. పవన్ కళ్యాణ్ కూడా ఈ నేలను విడిచి వెళ్లలేడని తెలిపారు.
ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తానని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన వారాహి యాత్రను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పవన్ కల్యాణ్ అనేవాడు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని తనపై కక్షగట్టారని ఆరోపించారు. ప్రజల్ని బాగా చూసుకుంటానంటే వైసీపీతో తనకు ఇబ్బంది లేదన్నారు. ఒక్క సీటు కూడా లేని జనసేనను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.